చిరు 152 లో మహేష్ బాబు పాత్ర వెనక అంత కథ ఉందా.? ముందు ఆ పాత్రలో ఎవర్ని అనుకున్నారంటే?

చిరు 152 లో మహేష్ బాబు పాత్ర వెనక అంత కథ ఉందా.? ముందు ఆ పాత్రలో ఎవర్ని అనుకున్నారంటే?

by Anudeep

Ads

మెగాస్టార్ సినిమా అంటే ఇటు ప్రేక్షకుల్లో , అటు సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అందుకే చిరు సినిమాలకి సంబందించి ఏ న్యూస్ అయినా హాట్ టాపికే . ప్రస్తుతం చిరంజీవి 152 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకుడు . ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చిరంజీవ్ లుక్ పట్ల ఎన్నో ఆసక్తికరమైన వార్తలు హల్ చల్ చేస్తుంటే , మరో హాట్ న్యూస్ బయటికి వచ్చింది అదేంటంటే , ఈ సినిమాలో చరణ్ నటించబోతున్నారు, కాదు బన్నీ కాదు కాదు మహేశ్ నటించబోతున్నారు . ఇంతకీ చిరు సినిమాలో ఎవరు నటిస్తున్నారు, ఏ పాత్ర పోషిస్తున్నారో తెలుసుకోవాలంటే చదవండి.

Video Advertisement

చిరు152 వ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటన్నారు .ఈ సినిమాలో చిరు ఓ కమ్యునిస్ట్ గా కనిపించబోతున్నట్టు ఇటీవల లీక్ అయిన ఓ పిక్ చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. అయితే ఈ చిత్రంలో యంగ్ చిరంజీవి పాత్ర ఓ లెక్చరర్ అని , అసలు లెక్చరర్ గా ఉన్న ‘ఆచార్య’  నక్సలైట్ గోవింద గా ఎలా మారడానికి దారి తీసిన పరిస్ధితులు ఏంటి.. అన్నది అసలైన కథ . లెక్చరర్ ఆచార్య పాత్ర గురించే ఇప్పుడు డిస్కషన్ .

రెండున్నర గంటల సినిమాలో సుమారు 40 నిమిషాల పాటు ఉండే లెక్చరర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట . అందుకే ఈ క్యారెక్టర్ చేయడానికి అంతే పవర్ ఫుల్ యాక్టరైతే బాగుంటుందని చరణ్ ని అనుకున్నారు . అయితే రాజమౌళి తెరక్కిస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది. అందులోనూ 2021 జనవరి 8 అంటూ విడుదల తేదీ కూడా అనౌన్స్ చేసేసారు. కాబట్టి ఆ పాత్ర చరణ్ చేయడం కుదరట్లేదు.

బన్నీతో చేయిద్దాం అని స్వయంగా చిరునే చరణ్ తో చెప్పారట . ‘రుద్రమదేవి’ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రని బన్నీ చాలా బాగా చేసాడు కాబట్టి… తనే కరెక్ట్ అని సిఫార్స్ చేసారట చిరు. కానీ మహేశ్ అయితే బెటరని దర్శకుడు శివ అభిప్రాయం . దాంతో బన్నీని తీసుకుందామా  ? మహేశ్ ని తీసుకుందామా? అనే మీమాంసలో మహేశ్ ఫైనల్ అయినట్టు సమాచారం. అల్లు అర్జున్ సుకుమార్ సినిమాతో బిజీ, ఆ సినిమా కోసం లుక్ కూడా మార్చి లావయ్యాడు . సో మహేశ్ బాబు ఫిక్స్.

ఈ పాత్ర మహేశ్ ఒప్పుకోవడానికి  రీజన్స్ ఉన్నాయి . చరణ్ కి మహేశ్ కి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది, డైరెక్టర్ శివ ఇప్పటికి మహేశ్ కి రెండు హిట్స్ ఇచ్చాడు.మరోవైపు మహేష్ సినిమా కూడా డిలే అయ్యింది. సో మొత్తంగా షూటింగ్ పార్ట్ కు 30 రోజుల కాల్షీట్స్ కు ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇంకేంటి అటు మెగాస్టార్ ఫ్యాన్స్ కి, ఇటు ప్రిన్స్ ఫ్యాన్స్ మొత్తంగా తెలుగు సినిమా అభిమానులకి పండగే.


End of Article

You may also like