మొదటిసారి ఈ 4 డైరెక్టర్స్ తో “మహేష్” కి హిట్…రెండోసారి రిపీట్ చేసేసేసరికి “ప్లాప్”.!

మొదటిసారి ఈ 4 డైరెక్టర్స్ తో “మహేష్” కి హిట్…రెండోసారి రిపీట్ చేసేసేసరికి “ప్లాప్”.!

by Mohana Priya

Ads

సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఫ్లాప్, హిట్ అనేవి సహజం. ఒకసారి ఒక కాంబినేషన్ హిట్ అయితే, తర్వాత అదే కాంబినేషన్ రిపీట్ అయినప్పుడు హిట్ అవ్వాలని రూలేమీ లేదు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు రిపీటెడ్ కాంబినేషన్ లో చేసిన కొన్ని సినిమాలు అనుకున్న ఫలితాలు సాధించలేదు. అలా కాంబినేషన్ రిపీట్ అయ్యి, మొదటి సినిమాకి వచ్చిన రిజల్ట్ రాని దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 గుణశేఖర్

మహేష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్ లో ఒక్కడు సినిమా వచ్చిన సంగతి, అది ఎంత పెద్ద హిట్ అయిందో అన్న సంగతి అందరికి తెలిసిందే. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో అర్జున్ సినిమా వచ్చింది. అది ఒక్కడు అంత కాకపోయినా యావరేజ్ గా నిలిచింది. తర్వాత వచ్చిన సైనికుడు సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

#2 శ్రీకాంత్ అడ్డాల

మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, పాటలు, మిగిలిన అన్ని బానే ఉన్నా కూడా కథ డ్రా బ్యాక్ అవ్వడంతో సినిమా అంత మంచి ఫలితం ఇవ్వలేదు.

#3 శ్రీను వైట్ల

దూకుడు సినిమా హిట్ అయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆగడు. ఈ సినిమా విజయం సాధించలేకపోయింది.

#4 త్రివిక్రమ్ శ్రీనివాస్

అతడు తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ఖలేజా. ఈ సినిమా థియేటర్స్ లో ఫ్లాప్ అయినా కూడా సినిమాని చాలా మంది ఇష్టపడతారు. అందుకే మోస్ట్ అండర్ రేటెడ్ సినిమాల్లో ఒకటిగా ఖలేజా నిలిచింది.

 


End of Article

You may also like