GUNTUR KARAM: గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు పేరు ఇదా…భలే ఉందే…!

GUNTUR KARAM: గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు పేరు ఇదా…భలే ఉందే…!

by Mounika Singaluri

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటు సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతుంది. అతడు ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హారిక అండ్ హాసిని బ్యానర్ పైన చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట విడుదలై సూపర్ హిట్ అయింది తాజాగా గుంటూరుకారంలోని ఓ మై బేబీ అనే రెండో సింగిల్ విడుదల చేయనున్నారు.

Video Advertisement

ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ లో మహేష్ బాబు అమ్ము అంటూ శ్రీ లీలను ముద్దుగా పిలుస్తున్నాడు. ఈ ప్రోమోలో శ్రీ లీలా కాస్ట్యూమ్స్ భలే ఉన్నాయి చాలా అందంగా కనిపించింది. అయితే ఈ ప్రోమో ద్వారా గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు పేరు ఏంటి అనేది రియల్ అయిపోయింది.

అమ్ము… రమణ గాడు… పేరు గుర్తు పెట్టుకో గుంటూరు వస్తే పనికొస్తది అంటూ మహేష్ డైలాగ్ చెప్పాడు. ఈ డైలాగ్ బట్టి చూస్తే ఈ సినిమాలో మహేష్ బాబు పేరు రమణ అని తెలుస్తుంది. ఈ పేరు మహేష్ బాబు కి భలే కలిసొస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రమణ లోడెత్తాలి రా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసింది. ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ పేరు కూడా రమణ అవడంతో మంచి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.


End of Article

You may also like