Ads
దర్శక ధీరుడు రాజమౌళి ఇండియాలోని నెంబర్ వన్ దర్శకుడుగా ఉన్నారు. తన కెరీర్లో అపజయం అంటూ ఎరుగని డైరెక్టర్ ఆయన. ఆయన తీసిన సినిమాల స్థాయి ప్రపంచవ్యాప్తంగా కీర్తిని గడిస్తున్నాయి. రాజమౌళితో సినిమా నుంచి ఎటువంటి హీరో అయిన సరే డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
Video Advertisement
ఆర్ఆర్అర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇండియానా జోన్స్ టైప్ లో ఉంటుందని వినికిడి. ఇది ఎక్కువ శాతం ఆఫ్రికాలో షూటింగ్ చేయనున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ముహూర్త కార్యక్రమం త్వరలో చేస్తారని తెలుస్తుంది. రాజమౌళి సినిమా అంటే హీరోలు ఏళ్లకు ఏళ్లు తమ డేట్స్ ఇచ్చేయాల్సిందే. ఈ క్రమంలో మహేష్ కూడా దాదాపు 3 ఏళ్ల పాటు తన డేట్స్ అన్ని జక్కన్న సినిమాకే ఇచ్చేశాడని టాక్. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ ఫైనల్ కాగా మహేష్ తో కలిసి డిస్కస్ చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడమే అని తెలుస్తుంది. రెండు భాగాలుగా తెరకెక్కించే ఈ సినిమా మొదటి పార్ట్ కోసమే దాదాపు 3 ఏళ్లు టైం తీసుకుంటారని తెలుస్తుంది. అంటే 2024 లో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ 2027 లో అది కూడా మొదటి పార్ట్ రిలీజ్ చేస్తారని టాక్.
ఇక రెండో పార్ట్ కి మరో రెండేళ్లు సమయం పడుతుంది. అంటే 2029 కి ఇది వస్తుంది.ఈ లెక్కన చూస్తే మహేష్ రాజమౌళి సినిమా కోసం మొత్తం ఐదారేళ్లు రాసిచ్చేస్తాడని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ తో మిస్సైన మరికొన్ని అవార్డులను మహేష్ సినిమాతో టార్గెట్ పెట్టాడు జక్కన్న. అందుకే ఆయన సినిమాలు తీయడం కాస్త టైం తీసుకున్నా టార్గెట్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. కేవలం తెలుగు సినిమాలతోనే సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న మహేష్ రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ అటెంప్ట్ చేస్తున్నాడు.
End of Article