Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ గత ఏడాది మే 12న రిలీజ్ అయ్యి, మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమాగా నిలిచింది.
Video Advertisement
ఈ మూవీలో మహేష్ బాబు చెప్పే డైలాగ్స్ ఆడియెన్స్ ను అలరించాయి. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రానికి డైలాగ్స్ ను రాశారు. అయితే ఈ మూవీలో బ్యాంక్ గురించి మహేష్ చెప్పిన డైలాగ్ ను అంతకుముందే మరో హీరో చెప్పారట. మరి ఆ హీరో ఎవరో? ఏ మూవీలో చెప్పారో ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ మూవీలో మహేష్ నటన, డైలాగ్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా, సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘కళావతి’ పాట అయితే ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు. ఈ పాటకు చాలా మంది సెలెబ్రిటీలు కూడా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ మూవీలో మహేష్ బాబు బ్యాంక్ గురించి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అయితే ఈ డైలాగ్ ను గతంలో వచ్చిన ఒక మూవీలో వేరే హీరో చెప్పడం విశేషం. ఆ హీరో చెప్పిన డైలాగ్ కు సంబంధించిన వీడియోను ట్రోల్ ప్లాజా అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఆ డైలాగ్ చెప్పిన హీరో శ్రీకాంత్, నిన్నే ప్రేమిస్తా మూవీలో బ్యాంక్ మేనేజర్ పాత్రలో శ్రీకాంత్ నటించారు. అక్కడి ప్రజలకి “డబ్బు అంటే లక్ష్మీ, ఆ లక్ష్మీ కొలువై ఉండేది బ్యాంక్ లో కదా! ఆ బ్యాంక్ గుడి లాంటిది. అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి” అని చెప్తారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CtQeMD8pR7L/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: “తలైవా ఈజ్ బ్యాక్..!” అంటూ… రజనీకాంత్ “జైలర్” రిలీజ్పై 15 మీమ్స్..!
End of Article