Ads
కమిట్మెంట్ కోసం ఎంత రిస్క్ తీసుకోవడానికి అయినా ఈరోజు టాలీవుడ్ హీరోలు వెనకడుగు వేయడం లేదు. మూవీ కోసం కొత్తగా పలు రకాల విన్యాసాలు, విద్యలు నేర్చుకొని మరి నటిస్తున్నారు. అందుకే వారు నటిస్తున్న చిత్రాలు సిల్వర్ స్క్రీన్ పై ఒక రేంజ్ లో ప్రేక్షకాదరణను సంపాదిస్తున్నాయి. ఎటువంటి స్టార్స్ లో ముందు ఉండేవారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
Video Advertisement
మహేష్ మరియు రాజమౌళి కాంబినేషన్లో సరికొత్తగా ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. జక్కన మూవీ అంటేనే హీరోకి హోంవర్క్ కామనే కదా. అందుకే ఇప్పుడు మహేష్‌కి కూడా మంచి వర్కౌట్ సెషన్ ఏర్పాటు చేశాడట జక్కన. మహేష్ కూడా ఈ మూవీ ప్రిపరేషన్ కోసం మూడు నెలలు కేటాయిస్తున్నాడు.
దీని కోసం మహేష్ ఏకంగా మూడు నెలలు పాటు బ్యాంకాంగ్‌కు షిఫ్ట్ కూడా కాబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కోసం మహేష్ బాబు కసరత్తులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.అంతేనా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ను కూడా నేర్చుకోవడానికి మహేష్ బ్యాంకాంగ్‌కు వెళ్లి మూడు నెలలు పాటు అక్కడే ఉండి మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ప్రయవెక్షణలో ట్రైనింగ్ పొండబోతున్నారు.
ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ కాంబో లో గుంటూరు కారం మూవీ తెరకెక్కుతోంది.ఈ షూటింగ్ పూర్తి అయిన వెంటనే మహేష్ రాజమౌళితో మూవీకి రెడీ అవుతున్నాడట. మహేష్ కు మూవీ పై ఉన్న డెడికేషన్‌కు ఇదొక నిదర్శనం అని చెప్పవచ్చు.మామూలుగానే మహేష్ మూవీస్ అంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు…అందులోనూ రాజమౌళి డైరెక్షన్ అంటే.. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో నెలకొన్నాయి. ఇప్పుడు ఈ చిత్రం కోసం మూడు నెలలు మహేష్ మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనే న్యూస్ మూవీ మీద హైప్ ఒక రేంజ్ లో పెంచింది.
End of Article