Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. మొదట ఈ చిత్రం ఈ ఏడాది ఆగష్టు 11న విడుదల అవుతుందని మూవీ యూనిట్ ప్రకటించింది.
Video Advertisement
అయితే చిత్ర బృందం ప్రకటించిన తేదీన ఈ చిత్రం రిలీజ్ కావడం తేలికైన విషయం కాదని సిని వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మహేష్ బాబు మూడు సామాజిక మాధ్యమాల ఫ్లాట్ ఫామ్స్ లో రికార్డ్ ను సెట్ చేయడంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో సపరేట్ గా సూపర్ స్టార్ మహేష్ కు పది మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఈ విధంగా 3 వేర్వేరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో పది మిలియన్ ఫాలోవర్లు కలిగిన ఒకే ఒక సౌత్ హీరో మహేష్ బాబు కావడం విశేషం. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ రికార్డ్ మహేష్ బాబుకు మాత్రమే ఉండడంతో ఆయన అభిమానులు చాలా ఆనందిస్తున్నారు. మహేష్ 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోయే మూవీ వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది.
ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. ఈ మూవీ కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి అని వినిపిస్తోంది. ఈ సినిమాని జక్కన్న పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నారని సమాచారం. అంతే కాకుండా రాజమౌళి గత చిత్రాల కన్నా రెట్టింపు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని వినిపిస్తోంది. మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆ కారణంగానే మహేష్ బాబు అరుదైన రికార్డును నమోదు చేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు. రాజమౌళి మూవీతో మహేష్ బాబు 100 కోట్ల పారితోషికం తీసుకునే సెలబ్రిటీల లిస్ట్ లో చేరనున్నారు.
Also Read: “తెలుగు సినిమా రికార్డ్ లు అన్ని తిరగరాసిన రోజు ఇదే..!” అంటూ… RRR “రిలీజ్” అయ్యి 1 సంవత్సరం అవ్వడంపై 15 మీమ్స్..!
Congratulations to our very own @urstrulyMahesh on reaching 🔟M Followers Milestone on Insta!!💫
It's Raining ♥️ for Reigning Super🌟 #MaheshBabu as he becomes the 1st South Indian actor to reach 10M followers across three SM platforms!!🔥#10MInstaStansForSSMB #SSMB28 #SSMB29 pic.twitter.com/x0C7gUKqe3— Telugu FilmNagar (@telugufilmnagar) March 17, 2023
End of Article