సూపర్ మార్కెట్ లో ఆ మహిళ చేసిన పిచ్చి పనికి… 26 లక్షలు విలువచేసే ఆహారాన్ని పడేసారు…

సూపర్ మార్కెట్ లో ఆ మహిళ చేసిన పిచ్చి పనికి… 26 లక్షలు విలువచేసే ఆహారాన్ని పడేసారు…

by Anudeep

Ads

కొందరికి బుద్ది ఉందో లేదో అర్దం కాదు . ముఖ్యంగా ప్రాంక్ వీడియో చేసేవాళ్లకి . చూడండి బాస్ ప్రాంక్ వీడియోస్ చేసే వాళ్లుంటే తిట్టుకోకుండా ఒక్కసారి ఆలోచించండి . మీరు చేసే ప్రాంక్ వల్ల ఎదుటోడు బాధపడ్తున్నాడా? సంతోష పడ్తున్నాడా? నిజాయితిగా చెప్పండి బ్రో . సరే మాకు చెప్పకపోయినా మీకు మీరే ఆలోచించుకోండి. ఈ చెత్త ప్రాంక్ వల్ల ఇప్పుడు ఏకంగా 26లక్షల ఫూడ్ వేస్ట్ చేయాల్సిన పరిస్తితి వచ్చింది .

Video Advertisement

నిజంగా చెప్తున్న కరోనా వచ్చి అసలు మనుషుల బుద్దేంటో తెలియచేస్తోంది అందరికి . ఒక్కక్కరిని లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది . నోర్మూసుకుని ఇంట్లో కూర్చొండి రా అంటే బోర్ కొడుతుందని గుంపులు గుంపులుగా క్రికెట్ ఆడతారు . రేపు ఉంటమో పోతమో అన్నట్టు రోడ్డెక్కి జీవితం అంతా ఈ రోజే చూసేయాలనుకుంటున్నారు కొందరు. ఒక మహాతల్లి అయితే ఏకంగా ఒక షాపింగ్ మాల్లో చేసిన నిర్వాకానికి అందరూ కరోనా భయంతో హడలి చస్తుంటే ప్రాంక్ చేసా అని సావు కబురు చల్లగా చెప్పింది .

అక్కడా ఇక్కడా ఆ దేశం.. ఈ దేశం అని తేడా లేకుండా కరోనా తన ప్రభావాన్ని ప్రతి చోట చూపిస్తుంటే, అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి . మనిషి బతకడానికి ఆహారం చాలా ముఖ్యం కాబట్టి నిత్యావసర వస్తువుల మార్కెట్లను మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. పెన్సిల్వేనియాలో హాన్వావర్ టౌన్ షిప్లో గెర్రీటి సూపర్ మార్కెట్లో సరుకుల కోసం వచ్చిన ఒక మహిళ దగ్గింది .కరోనా భయంతో దగ్గినా,తుమ్మినా జనం భయపడుతున్నారు కదా ఆ అమ్మాయి దగ్గగానే అక్కడ  ఉన్నవాళ్లంతా భయంతో హడలి చచ్చారు . షాప్ మేనేజ్మెంట్ కూడా అలర్ట్ అయింది.

కాని ప్రాంక్ చేయడం కోసం అలా దగ్గానని చెప్పింది . అక్కడ ఉన్నవాళ్లతో పాటు సిబ్బందికి కోపం వచ్చింది. ఆమెను వెంటనే సూపర్ మార్కెట్ నుంచి బయటకు పంపేశారు. అయితే ఏ దగ్గు వెనుక ఏ వైరసుందో అని భయపడిన షాపు యాజమాన్యం తమ కొచ్చే లాభాలకంటే జనాల ఆరోగ్యాలు ముఖ్యం అనుకుంది . ఆ అమ్మాయి ముట్టుకున్న ఫూడ్ ని, ఆమె దగ్గిన చోట ఉన్న ఫూడ్ ని అన్నింటిని పారేయాలని నిర్ణయం తీసుకుంది.

మొత్తంగా 26లక్షలు విలువ చేసే ఆహారాన్ని పారేసింది. లాభాల కోసం ఆలోచించకుండా ప్రజల ఆరోగ్యం కోసం షాపు యాజమాన్యం  తీసుకున్న నిర్ణయం అద్భుతమని కొనియాడుతున్నారు నెటిజన్లు. ఇప్పడు చెప్పండి ఇలాంటి వాళ్లని ఏం చేయాలి నేనైతే కరోనా పేషెంట్స్ ఉన్న క్వారంటైన్ వార్డ్  కి పంపించి అక్కడ వారికి సేవలు చేయాలి అంటాను . అదే సరైన పనిష్మెంట్.

ఫ్రాంక్స్ వల్ల ఎంత పెద్ద నష్టాలు జరుగుతాయి అనేదానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ . అసలు వ్యక్తిగతంగా ఎంత నష్టపోతారనేది తెలియాలంటే ఒకసారి అమలాపాల్ నటించిన “ఆమె” సినిమా చూడండి.


End of Article

You may also like