Ads
కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి,ప్రజలందరూ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయాలంటే ఏకైక మార్గం లాక్ డౌన్. కాని ప్రభుత్వ సూచనని ఎంతమంది పాటిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలందరూ లాక్ డౌన్ పాటించేలా పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. మాటలతో చెప్తున్నారు,వినని వారికి లాఠికి పనిచెప్తున్నారు. లాక్ డౌన్ పాటించండి అని కొందరిని చేతులెత్తి మొక్కి వేడుకుంటున్నారు . జమ్ములోని ఒక ఊరిలో మహిళలు లాఠీలు పట్టుకుని పోలీసుల పని చేస్తున్నారు .
Video Advertisement
జమ్మూలోని చత్తాపిండ్ అనే ఊరికి ఆ ఊరి ఆడవాళ్లే కాపలా కాస్తున్నారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాకుండా చూడడమే కాదు, గ్రామంలోకి బయటి నుండి ఎవరు రాకుండా చూస్తున్నారు . అక్కడి మాజీ సర్పంచ్ గుర్మీత్ కౌర్ నేతృత్వంలో కొందరు ఆడవాళ్లంతా పొద్దున 9 నుంచి 4 గంటల వరకు ఈ డ్యూటీ చేస్తున్నారు. కేవలం ఇంటి నుండి ఎవరిని రానివ్వకుండా చూడడం, ఊర్లోకి ఎవరూ రాకుండా చూడడం మాత్రమే కాదు, కరోనా గురించి వివరిస్తూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు.
“ కరోనా భయంకరమైన వ్యాధి నుండి మా ఊరిని మేం కాపాడుకునేందుకే ఈ డ్యూటీ చేస్తున్నాం. మా వంతుగా పోలీసులకి సహకరిస్తున్నాం. ప్రజల కోసం వారు చేస్తున్న కృషికి, వారి పనిలో సాయం చేస్తూ, వారికి కొంత ఉపశమనం ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నం.కరోనా ఒకరికి వస్తే అది పదిమందికి అంటుకుంటుంది. దాని వల్ల వచ్చే నష్టం తెలియక చాలామంది బయట తిరుగుతున్నారు. అలాంటి వారికి కరోనా వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్నాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నాం అన్నారు మాజి సర్పంచ్ గుర్మీత్.
ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్‌లో ఇప్పటివరకు 188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇప్పటికి నలుగురు చనిపోయారు, జమ్మూ రీజియన్‌లో ఇప్పటికి ఒక మరణం నమోదైంది.దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,933 . మరణాలు 392.. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మరికొద్ది రోజులు లాక్ డౌన్ పొడిగించింది ప్రభుత్వం మిగతా దేశాలకంటే మన దేశం పరిస్థితి మెరుగ్గా ఉందని అశ్రద్ద చేయకుండా అందరం లాక్ డౌన్ పాటిద్దాం, కరోనాని తరిమికొడదాం.
End of Article