Ads
దేశం పురోగమిస్తుంటే.. ఆకలి చావులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. స్విగ్గిలు, జొమాటో లు వచ్చాక ఫుడ్ దగ్గరికొచ్చినా.. చాల మంది కడుపులకు దూరం గానే ఉంది. ఒకవైపు ఫుడ్ ను వేస్ట్ చేసే వాళ్ళ సంఖ్యతో పాటు.. తగిన ఫుడ్ దొరక్క ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
Video Advertisement
టెక్నాలజీ పరం గా ఎంత ముందుకెళ్తున్నా.. ఆకలి కడుపులు నింపడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఇటీవల సోషల్ మీడియా లో ఓ స్టోరీ వైరల్ అవుతోంది. ఇది ఓ సెక్యూరిటీ గార్డ్ స్టోరీ. ఆ వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తూ.. లంచ్ టైం లో తినడానికి సిద్ధం గా ఉన్నాడు. అతను ఏమి తింటున్నాడో తెలుసా.. అన్నం, నీరు, ఉల్లిపాయ తో పాటు రెండు, మూడు వెల్లుల్లిపాయలు అంతే.
అతను కలుపుకోవడానికి కనీసం పచ్చడి, మజ్జిగ కూడా లేవు. కానీ అతను కొన్నాళ్లనుంచి అలానే ఆహరం తీసుకుంటున్నాడట. అతను చేసేది సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం. తనకు వచ్చే జీతం లో ఎక్కువ శాతం ఇంట్లోని సభ్యులకే పంపిస్తాడు. మిగిలిన కొంచం మొత్తం లోనే తాను రోజు ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాడట.
ఈ ఫోటో ను ఆపిల్ లిడ్ అనే ఫేస్ బుక్ యూజర్ పంచుకున్నారు. అతని గురించి చెప్తూ..” ఈ ఫొటోలోని వ్యక్తి నా ఫ్రెండ్. చాలా కష్టపడి పనిచేస్తాడు. తన సంపాదనలో ఎక్కువ మొత్తం ఇంటికి పంపిస్తూ.. కొంచమే తనకోసం ఉంచుకుంటాడని.. ఆ డబ్బుతోనే ఇలాంటి ఆహరం తీసుకుంటున్నాడని” తెలిపాడు. ఈ ఫోటో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు అతనిని చూసి అయ్యో పాపం అంటున్నారు. తొందరలోనే అతని కష్టం ఫలించి అతను ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుందాం.
End of Article