తెలుగు సినిమా మీద మలయాళం వాళ్ల సెటైర్..! ఈ సీన్ చూశారా..?

తెలుగు సినిమా మీద మలయాళం వాళ్ల సెటైర్..! ఈ సీన్ చూశారా..?

by kavitha

Ads

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలలో ఉన్నత స్థితిలో ఉంది. అన్ని ఇండస్ట్రీల దృష్టి ఇప్పుడు టాలీవుడ్ పైనే ఉంది. ఒకప్పుడు తక్కువగా చూసిన టాలీవుడ్ ఇప్పుడు అంతర్జాతీయంగాను సత్తా చాటింది. గత ఏడాది జక్కన దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తిని చాటింది.

Video Advertisement

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి తెలుగు సినిమాల పై మాలీవుడ్ సినిమాలలో సెటైర్ వేస్తున్నారు. అలాంటి ఒక సీన్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజెన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. helen-movieఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. కానీ టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలతో దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మారుమోగింది. ఆ తరువాత వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ తో అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు క్రేజ్ ఏర్పడింది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ వంటి డైరెక్టర్ ప్రశంసలు కురిపించాడు అంటే తెలుగు సినిమా ఖ్యాతి గురించి అర్ధం చేసుకోవచ్చు. జక్కన్న నెక్స్ట్ సినిమా కోసం ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఒక మలయాళ సినిమాలో టాలీవుడ్ పై సెటైర్ వేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘త్రిశంకు’ అనే మలయాళ మూవీలో హీరోయిన్, ఆమె ఫ్రెండ్స్ కూర్చోని మాట్లాడుకుంటూ ఉంటారు. అపుడు హీరోయిన్ వల్ల నాన్న పెళ్లికి ఒప్పుకోడు ఏమో అంటుంది. అప్పుడు పక్కన ఉన్న అమ్మాయి తెలుగు సినిమాలలో లాగా లేచిపో అని చెప్తుంది. నిజానికి అన్ని తెలుగు సినిమాలూ అలా ఉండవు. కానీ ఈ సినిమాలో ఆ పదం వాడేసారు. ఈ వీడియో చూసిన కొంత మంది తెలుగువాళ్ళు మా సినిమాలు అన్నీ అలా ఉండవు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read: “పవన్ కళ్యాణ్ పాత సినిమాలన్నీ గుర్తొస్తున్నాయి..! అంటూ… పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ “బ్రో” టీజర్‌పై 15 మీమ్స్..!


End of Article

You may also like