బాలయ్య చేసినట్టు…ఇలా రియల్ లైఫ్ లో ఏ హీరో కూడా చేయలేరు అనుకుంటా.? జై బాలయ్య.!

బాలయ్య చేసినట్టు…ఇలా రియల్ లైఫ్ లో ఏ హీరో కూడా చేయలేరు అనుకుంటా.? జై బాలయ్య.!

by Mounika Singaluri

Ads

తెలుగు ఇండస్ట్రీలో ప్రతి హీరోకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాగే బాలయ్య బాబుకు కూడా మంచి క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు కానీ ప్రతి హీరో అభిమానులు కచ్చితంగా బాలయ్యను కూడా అభిమానిస్తారు.

Video Advertisement

బాలయ్య బాబుకి తన సినిమాలకే కాకుండా తన మాటలకి, తన బిహేవియర్ కి కూడా ఫాన్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బాలయ్య బాబు సినిమాలు అంటే అక్కడ జరిగే రచ్చ అంతా ఇంతా కాదు.

man about balakrishna

తనకు నచ్చిన విషయాల గురించి గొంతెత్తి మాట్లాడుతాడు, అలాగే ఏదైనా నచ్చితే మెట్టు దిగిన అయినా అభినందిస్తాడు బాలయ్య. అలాగే ఈమధ్య బాలయ్య చేసిన ఒక పనికి అభిమానులు అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం బాలయ్య తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తూ ఉన్నాడు. అయితే ఒక వీరాభిమాని బాలయ్య కార్యాలయానికి వెళ్ళాడు. మామూలుగా ఏ హీరో అయినా అంతలా పట్టించుకోరు కానీ బాలయ్య మాత్రం ఆ వ్యక్తిని లోపలికి పిలిచి మాట్లాడాడు.

ఆ వ్యక్తి వికలాంగుడు కావడంతో తను కాళ్ళ మీద నిలబడి మాట్లాడలేకపోయాడు. కనుక బాలయ్య తనతో మాట్లాడడానికి అని మోకాల మీద కూర్చొని ఆప్యాయంగా మాట్లాడాడు. ఏ హీరో అయినా ఇలా చేస్తారా మన బాలయ్య బాబు తప్ప? అంటూ అభిమానులు బాలయ్య బాబుని పొగుడుతూ సోషల్ మీడియాలో ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. మా బాలయ్య బాబు కనుకే ఇలా చేశారు.

మరే హీరో అయినా ఇంత మెట్టు దిగి మరి ఒక అభిమానితో మాట్లాడడు. బాలయ్య బాబు బయటకి అంత కోపంగా ఉన్నా సరే అతని మనసు వెన్నెముక లాంటిది. ప్రతి ఒక్కరికి అభిమానాన్ని పంచుతారు. అందుకే మేము బాలయ్యకు అభిమానులం అయ్యాము. జై బాలయ్య.. జై జై బాలయ్య.. అంటూ నినాదాలతో ట్రెండ్లు చేస్తూ బాలయ్య అభిమానులు బాలయ్యను పొగుడుతూ సోషల్ మీడియా అంతా రచ్చ చేస్తున్నారు.


End of Article

You may also like