మెసేజెస్ పెట్టి ఓ అమ్మాయిని హర్ట్ చేసినందుకు 3.5 లక్షలు చెల్లించమన్న కోర్టు.. అబ్బాయిలూ జర జాగ్రత్త..!

మెసేజెస్ పెట్టి ఓ అమ్మాయిని హర్ట్ చేసినందుకు 3.5 లక్షలు చెల్లించమన్న కోర్టు.. అబ్బాయిలూ జర జాగ్రత్త..!

by Anudeep

Ads

ఇటీవల టెక్స్ట్ మెసేజ్ లు పెట్టి ఓ మహిళ ఫీలింగ్స్ ను హర్ట్ చేసినందుకు గాను యుఎఈ కోర్టు ఆ అబ్బాయి ఇరవైవేల డాలర్లు (3.5 లక్షలు) పరిహారం గా చెల్లించాలని ఆదేశించింది. సదరు వ్యక్తి పంపిన సందేశాలను చూపి.. తనకు లక్ష డాలర్లు పరిహారం ఇప్పించాలంటూ కోర్టు లో కేసు వేసింది. ఈ కేసు విచారణ పూర్తి అయ్యాక.. ఆ అమ్మాయికి ఇరవై వేల డాలర్ల పరిహారం ఇవ్వాల్సింది గా కోర్టు ఆదేశించింది.

Video Advertisement

whatsapp case

సదరు అబ్బాయి ఆ మహిళకి చాలా మంది పురుషులతో సంబంధం ఉందంటూ మెస్సేజ్ లు పంపాడు. అంతే కాదు అతనిని వలలో వేసుకోవడానికి ఆమె తన ఫోటోలను పంపేదని కూడా ఆరోపించాడు. దీనితో.. ఆమె హర్ట్ అయి కోర్టులో కేసు వేసింది. ఈ విచారణ సమయం లో అతను ఎవరికీ మెసేజ్ చేసాడు.. ఆ వ్యక్తి తనకు మెసేజ్ చేసాడని.. ఇది తాను అవమానం గా భావిస్తున్నట్లు పేర్కొంది. తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని కోరింది. ఈ కేసు విచారించాక కోర్టు పై విధం గా తీర్పునిచ్చింది.


End of Article

You may also like