Ads
రిలేషన్ షిప్ లో ఉన్నపుడు అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని దాటుకుని భాగస్వామి పై తమకు ఉన్న ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే.. ఇక్కడే చాలా మంది తప్పటడుగులు వేస్తూ దూరం పెంచుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామి తో వచ్చే ఈ దూరం చాలా దూరం తీసుకెళ్తూ ఉంటుంది. నాది కూడా అలాంటి కధే.. నా సమస్యకి పరిష్కారం చెప్పగలుగుతారని భావిస్తున్నా..
Video Advertisement
మేమిద్దరం గత ఎనిమిదేళ్లు గా రిలేషన్ లో ఉన్నాం. అయితే.. నాకు తనకు మధ్య దూరం పెరిగింది. మాటలూ తగ్గాయి.. మరో వైపు ఆమె బెస్ట్ ఫ్రెండ్ తో నా మాటలు కలిసాయి. అలా మా ఇద్దరి మధ్యా స్నేహం కూడా పెరిగింది. ఆ స్నేహం మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడేవరకు వచ్చింది. ఎప్పుడూ మేమిద్దరం మా స్నేహితులందరితో కలిసి తిరుగుతూనే ఉంటాం.. అయితే.. ఓ రోజు మేమిద్దరం ఏకాంతం గా గడిపాము.
అయితే ఇలా జరిగిపోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. నా ప్రియురాలిని మోసం చేశానేమో అన్న బాధ నన్ను వెంటాడుతోంది. ఆమెకి చెప్పి ఆమెను ఇంకా దూరం చేసుకోలేనేమో అని బాధ గా ఉంది. ఆమెకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. అలా అని నేనే ఆమెకు దూరం గా జరిగిపోవాలా? అన్న విషయం కూడా అర్ధం కావడం లేదు. నేను ఆమెకు బ్రేక్ అప్ చెప్పి దూరం జరగాలా..? లేక ఆమెకు నిజం చెప్పి ఆమెను బాధపెట్టాలా..? నాకు సలహా ఇవ్వగలరు.
End of Article