Ads
టీవీ షోలన్నిటిలో బిగ్ బాస్ మాత్రం కొంచెం సపరేట్ గానే ఉంటుంది. రోజు కంటెస్టెంట్స్ మధ్య గొడవ, దాని గురించి సోషల్ మీడియాలో చర్చ, మళ్లీ వారం మొత్తంలో అయిన గొడవల గురించి వీకెండ్ లో చర్చ. మధ్యలో టాస్క్ లు, మళ్లీ వాటి మధ్యలో కూడా గొడవలు. అసలు ఆదివారం ఎపిసోడ్ లో తప్ప వారం మధ్యలో జరిగే ఎపిసోడ్స్ లో గొడవ పడని బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా అరుదుగా ఉంటుంది.
Video Advertisement
వీకెండ్ ఎపిసోడ్స్ తప్ప మిగిలిన వారం మధ్యలో అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు వచ్చే ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ఎవరి మాట విన్నా వినకపోయినా ఒకరికి మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అలా వినేది ఎవరికో ఈ పాటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఆయనే బిగ్ బాస్. బిగ్ బాస్ ఆదేశించారని ఆ గొంతు వచ్చిన వెంటనే కంటెస్టెంట్స్ అందరూ ఆయన చెప్పినది పాటించాల్సిందే.
ఇంతకీ మనకి కనిపించకుండా, మనకే కాదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా కనిపించకుండా హౌస్ మొత్తం రూల్స్ ఫాలో అయ్యేలా చేస్తున్న ఆ గొంతు ఎవరిదో తెలుసా? ఆయన పేరు రాధా కృష్ణ. రాధాకృష్ణ ఒక సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సీజన్ వన్ స్టార్ట్ అయ్యే ముందు వాయిస్ ఓవర్ కోసం దాదాపు 100 మందికి పైగా ఆడిషన్ చేశారట. వాళ్ళ లో నుండి రాధాకృష్ణ గారిని సెలెక్ట్ చేసారట. బిగ్ బాస్ కి మాత్రమే కాకుండా ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ కి, సినిమాల్లో ఇంకా సీరియల్స్ లో చాలామంది నటులకి కూడా డబ్బింగ్ చెప్పారు.
End of Article