అరెస్ట్ అవ్వాలనే ఉద్దేశం తో ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి పీఎం ని చంపేస్తా అని బెదిరించిన వ్యక్తి.. ఇదేమి పనో..?

అరెస్ట్ అవ్వాలనే ఉద్దేశం తో ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి పీఎం ని చంపేస్తా అని బెదిరించిన వ్యక్తి.. ఇదేమి పనో..?

by Anudeep

Ads

22 ఏళ్ల ఓ కుర్రాడికి ఉన్నట్లుండి వింత బుద్ధి పుట్టింది. తనకు పోలీసులతో అరెస్ట్ చేయించుకోవాలనిపించింది. అనుకున్నదే తడవుగా ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసాడు. తాను ప్రధాని మోడీ ని చంపేస్తానని బెదిరించాడు. ఫోన్ పెట్టేసాడు. పోలీసులు ఈ గుర్తు తెలియని ఫోన్ ఎక్కడిదో ట్రేస్ చేసారు.ఆ వ్యక్తి పేరు సల్మాన్ గా గుర్తించారు. ఇన్వెస్టిగేషన్ లో అప్పటికే సల్మాన్ పైన చాలా కేసులున్నాయని తేలింది.

Video Advertisement

arrest

ఓ కేసు కి సంబంధించి బెయిల్ పై ఉన్న సల్మాన్.. తిరిగి జైలు లోకే రావడానికి ఈ పని చేసాడని తెలిసింది. గతం లో కూడా ఇలానే ఓ 33 సంవత్సరాల వ్యక్తి పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ అయిన 100 కు ఫోన్ చేసి పీఎం మోడీ కి హాని చేస్తా అంటూ ఇలానే బెదిరించాడు. అప్పుడు కూడా ఇలానే ట్రేస్ చేసి.. ఆ వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసారు.


End of Article

You may also like