Ads
ఈ రోజులలో ఎవరైనా 60,70 ఏళ్లకు మించి బ్రతికితే గొప్ప. ఒకవేళ బ్రతికినా ఒంటినిండా రోగాలతో, దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు అంటూ బ్రతుకుతారు. అందుకు కొంత భాగం స్వయంకృతాపరాధం అయితే కొంత భాగం ప్రస్తుత సమాజ పరిస్థితులు.
Video Advertisement
పొల్యూషన్, టెన్షన్, బయట ఫుడ్ ఎక్కువగా తినటం వంటివి మనిషి ఆరోగ్యాన్ని ఆయుష్షుని చాలా మటుకు తగ్గించేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకి 104 సంవత్సరాలు, ఆమె కొడుకుకి 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల కొడుకు 104 సంవత్సరాల తల్లికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపాడు.
దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.104 సంవత్సరాల ఆ తల్లికి రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు లేవు, ఆమె పని ఆమె చక్కగా చేసుకుంటుంది, కంటి చూపు కూడా చక్కగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఆమె దంతాలు ఊడిపోలేదు, వినికిడి శక్తి తగ్గలేదు. ఆమె కేవలం శాఖాహారం మాత్రమే తింటుంది. ఆ వృద్ధురాలు పేరు మంండాగున్న రాజమ్మ. 1920లో జన్మించింది, ఆమెకు 12 సంవత్సరాల వయసులో పెళ్లి జరిగితే, 14 సంవత్సరాల వయసులో కొడుకు పుట్టాడు. 17 సంవత్సరాల వయసులో భర్తని కోల్పోయింది.
అప్పటినుంచి ఆమె తన తల్లిదండ్రుల వద్ద పెరిగింది. కుట్లు అల్లికల పని చేసుకుంటూ కొడుకుని చదివించింది. అతడు కూడా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఇప్పుడు అతని వయసు 90 సంవత్సరాలు కాగా అతను తల్లి గురించి మాట్లాడుతూ తన తల్లి బయట ఆహారం అసలు తీసుకోదు. ఈ వయసులో కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుందని, ఆమెకు ఎటువంటి మోకాళ్ళ నొప్పులు లేవు, చర్మం కూడా ముడతలు పడలేదు. సాత్విక ఆహారమే తన తల్లి ఆరోగ్య రహస్యమని ఆమె కొడుకు చెప్తున్నాడు. తన తల్లికి ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువని, ఇటీవల జరిగిన జన్మదిన వేడుకలలో కూడా కేక్ కట్ చేసినప్పుడు చాలా చిన్న ముక్క మాత్రమే తిన్నదని మా అమ్మ ఆరోగ్యం మీద తీసుకునే శ్రద్ధకి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అని చెప్పాడు.
End of Article