Ads
ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఈరోజుల్లో చాలా మాములు వ్యవహారం అయిపొయింది. పెద్దలకు ఇష్టం లేకపోయినా చాలా మంది తాము మేజర్లం అయ్యామంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక్కడ వారు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటె ఎవరికీ బాధ ఉండదు.
Video Advertisement
కానీ, పెళ్ళైన నెల రోజులకే కూలిపోయే ఈ కాపురాలు తల్లితండ్రులకు తీరని మనోవేదనని మిగులుస్తున్నాయి. మరోవైపు అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు కూడా ఎక్కువ అవుతున్నారు.
నెల రోజుల సంగతి అటుంచితే.. ఓ జంట ఏకంగా వారం రోజులకే విడిపోయింది. తిపటూరు తాలూకాలోని హిండిస్కెర గ్రామానికి చెందిన ప్రేమ జంట రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. తిపటూరు తాలూకాకు చెందిన నిఖిల్, చైత్ర వేరు వేరు కులాలకు చెందిన వారు. వారు ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పారు.
వీరిద్దరూ తురువెకెరెలో ఒక మొబైల్ షోరూంలోనే పని చేస్తున్నారు. ఫిబ్రవరి నాలుగవ తేదీన వీరిద్దరూ గుడిలో దండలు మార్చుకున్నారు. మరో మూడు రోజులకు ఇంటి నుంచి వేరుగా వచ్చేసి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. ఇండిస్కెరె గ్రామంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని వీరు కాపురం ప్రారంభించారు. అయితే.. ఫిబ్రవరి 10 వ తేదీన తన తల్లికి అనారోగ్యంగా ఉందని, చూసి వస్తానని చెప్పి నిఖిల్ ఇంటికి వెళ్ళాడు. ఎన్ని రోజులైనా అతని తిరిగి రాలేదు. అయితే.. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీనితో చైత్ర పరవగొండనహళ్ళిలో ఉన్న నిఖిల్ ఇంటికి వెళ్ళింది. అక్కడ నిఖిల్ తండ్రి ఆమెను తీవ్రంగా దూషించి ఇంటినుంచి వెళ్ళగొట్టాడు. దీనితో తనకు న్యాయం చేయాలంటూ చైత్ర కిబ్బనహళ్ళి పోలీసులను ఆశ్రయించింది.
End of Article