ఇంట్లో మొగుడు, సొరంగం లో ప్రియుడు.. ఖతర్నాక్ లేడీ.. ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఇంట్లో మొగుడు, సొరంగం లో ప్రియుడు.. ఖతర్నాక్ లేడీ.. ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anudeep

Ads

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కాన్సెప్ట్ ఇపుడు చాలా పాతబడిపోయింది. ప్రస్తుత కాలం లో అక్రమ సంబంధాలు ఎక్కువవుతున్న నేపధ్యం లో వెలుగుచూస్తున్న ఘటనలు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఓ ప్రియుడు ఇంట్లో ఇల్లాలి కంట పడకుండా, తన ప్రియురాలిని చేరుకోవడానికి ఓ ప్లాన్ వేసాడు. తన ప్రియురాలి భర్తకు కూడా తెలియకుండా ఇంట్లో బెడ్ రూమ్ లో నుంచి ప్రియురాలి బెడ్ రూమ్ వరకు ఏకం గా ఓ సొరంగాన్ని తవ్వేశాడు. ఇద్దరు గుట్టు గా లాక్కొచ్చారు. అయితే, ఆ ప్రియురాలి భర్తకి అనుమానం రావడం తో వీరిద్దరి బండారం బయటపడింది.

Video Advertisement

మెక్సికో లోని అల్బెర్టో అనే వ్యక్తి తన ప్రియురాలిని రహస్యం గా కలుసుకోవడం కోసం ఈ పని చేసాడు. అతడి ప్రియురాలి భర్త సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తాడు. రాత్రి వేళా అతను డ్యూటీ కి వెళ్లిన సమయం లో ఇంట్లో, ఇల్లాలికి తెలియకుండా సొరంగ మార్గం నుంచి ప్రియురాలి ఇంటికి చేరుకొని ఇద్దరు సమయం గడుపుతున్నారు. ఈ క్రమం లో ఓ రోజు ఆ ప్రియురాలి భర్త సగం డ్యూటీ చేసి వచ్చేసాడు. తన వద్ద ఉండే డూప్లికేట్ కీ తో తాళం తీసి లోపలకు వెళ్ళాడు. తీరా చుస్తే, తన భార్య ఎవరితోనో సరసమాడడం గమనించాడు. తానూ లోపలకు వెళ్లేసరికి ఆల్బర్ట్ మంచం కిందకి వెళ్లి సొరంగం లో నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

tunnel in bedroom

హఠాత్తుగా ఈ మనిషి ఏమయ్యాడా? అని అనుమానం వచ్చిన భర్త మంచం కింద చూడగా అక్కడ హోల్ కనిపించడం చూసాడు. అతను కూడా ఆ హోల్ లొపలకి దిగాడు. అక్కడ సొరంగం ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సొరంగం ద్వారా ఆల్బర్ట్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఆల్బర్ట్ తో గొడవ పెట్టుకోగా, ఇక్కడ గొడవ చేయవద్దని, ఈ విషయం తన భార్య కి తెలియదని ఆల్బర్ట్ బతిమాలాడు. అయినా, ఆ భర్త ఆల్బర్ట్ ని పిచ్చకొట్టుడు కొట్టడం తో చుట్టుపక్కల అందరు పోగయ్యారు. ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడం తో, పోలీసులు కూడా రంగం లోకి దిగి ఆల్బర్ట్ ను అరెస్ట్ చేసారు. ఆల్బర్ట్ ఇటుకలు తయారు చేసే పని చేసేవాడని, అందుకే అతనికి సొరంగం తవ్వడం అంత కష్టం కాలేదని తెలుస్తోంది.

note: images used in this article are for reference purpose. but not the actual characters


End of Article

You may also like