ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. అసలు కారణం ఏంటో తెలిస్తే షాక్..!

ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. అసలు కారణం ఏంటో తెలిస్తే షాక్..!

by Anudeep

Ads

అందంగా, ఆరోగ్యంగా ఉండాలని అందరు కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం నిత్య యవ్వనంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కోరుకోవడంలో తప్పు లేదు కానీ.. దాని కోసం వింత పనులు చేస్తేనే చూసే వారికి షాక్ తగులుతూ ఉంటుంది. నిజానికి యోగ, మంచి డైట్ ఫాలో అవుతూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

Video Advertisement

కానీ, ఈ వ్యక్తి మాత్రం ఆరేళ్లుగా తన మూత్రాన్నే తాగేస్తున్నాడు. ఇలా చేయడం వల్లే తన వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తున్నాను అంటూ చెప్పుకుంటున్నాడు. ఇతని పేరు హ్యారీ మెటాడీన్. ఇంగ్లాండ్ కు చెందిన వ్యక్తి. ఇతని వయసు 34 సంవత్సరాలు.

harrey 1

2016 నుంచి ఇప్పటివరకు హ్యారీ మెటాడీన్ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. దాదాపు పదేళ్ల యంగ్ గా తాను కనిపిస్తున్నానని చెప్పుకొచ్చాడు. గతంలో తనకు కొన్ని మానసిక సమస్యలు ఉండేవని చెప్పుకొచ్చాడు. వాటిని ఎదుర్కోవడం కోసమే తాను యూరిన్ థెరపీని ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. ఇలా మొదలు పెట్టాక తనకు మానసిక ప్రశాంతతతో పాటు కొత్త అనుభూతి లభించినట్లు పేర్కొన్నాడు.

harrey 2

తన మూత్రాన్ని బాటిల్స్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. రోజు 200 మి.లీ ల చొప్పున తాగుతూ ఉంటాడు. దీనిని తాగిన తరువాత మెదడు శక్తివంతమై చురుకుగా పని చేస్తున్నట్లు హ్యారీ మెటాడీన్ తెలిపాడు. అలాగే ఈ మూత్రాన్ని ముఖానికి మసాజ్ చేయడం వలన కూడా తాను యంగ్ గా కనిపిస్తున్నానని చెప్పుకొచ్చాడు. 90 శాతం నీరు ఉన్న మూత్రానికి శరీరంలో అన్ని రోగాలను నయం చేసే శక్తి ఉందన్నాడు. దీనికి ఏమి ఖర్చు చేయక్కర్లేదని కూడా చెప్పుకొచ్చాడు. గతంలో కూడా సింగర్స్‌ మడోన్నా, కేషా తాము కూడా తమ మూత్రం తాగుతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వైద్యులు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇలా తాగడం వలన డీహైడ్రేషన్ పెరిగి, ఇన్ఫెక్షన్లు వస్తాయని చెబుతున్నారు.


End of Article

You may also like