ముఖానికి మాస్క్ పెట్టుకోమంటే మహిళల అండర్ వేర్ పెట్టుకుని వచ్చాడు.. చివరకి ఏమి జరిగిందంటే..?

ముఖానికి మాస్క్ పెట్టుకోమంటే మహిళల అండర్ వేర్ పెట్టుకుని వచ్చాడు.. చివరకి ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

ఈ ఏడాది కరోనా మహమ్మారి ఎంత ఉధృతం గా వ్యాప్తి చెందిందో తెలిసిందే. దేశమంతా కరోనా సెకండ్ వేవ్ కారణం గా తీవ్ర ఇబ్బందులు పడింది. శ్వాస లో ఇబ్బందులు, జ్వరం రావడం, ప్లేట్ లెట్స్ కౌంట్ డౌన్ అవడం వంటి ఇబ్బందులతో పలువురు హాస్పిటల్స్ కె పరిమితమయ్యారు.

Video Advertisement

ప్రస్తుతం తిరిగి కరోనా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. కరోనా ను మరింత సీరియస్ గా తీసుకుని నియమాలను పాటించాల్సిన అవసరం ఏర్పడుతోంది. అందరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఏర్పడుతోంది.

mask 1

ఇప్పటికీ పలు సూపర్ మార్కెట్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్ పోర్ట్స్ అన్ని పబ్లిక్ ప్రదేశాల్లోనూ మాస్క్ ని ధరించడం తప్పనిసరిగా ఉంది. ఇక ఏరోప్లేన్స్ లో ప్రయాణించేవారికి నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. మాస్క్ ధరించనిదే ఎవరిని ఎయిర్ పోర్ట్ లోపలకి కూడా అనుమతించరు.

mask 2

కానీ, ఇటీవల ఫ్లోరిడా లోని ఫోర్ట్ లౌడెర్ డేల్ ఎయిర్పోర్ట్ లో ఓ అమెరికన్ విమానంలో ఆడమ్ జెన్ అనే యువకుడు మాత్రం మాస్క్ ధరించడానికి బదులు మహిళల అండర్ వేర్ ను ధరించి ప్లేన్ ఎక్కాడు. దీనితో చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రయాణికులు షాక్ అయ్యారు. ఇక విమాన సిబ్బంది కూడా తొలుత షాక్ అయ్యారు. అది తీసేసి మాస్క్ ని ధరించాలంటూ విమాన సిబ్బంది సదరు వ్యక్తిని కోరారు.

mask 3

అయితే.. అతను అందుకు నిరాకరించాడు. మాస్క్ లానే ఇది కూడా తనకు రక్షణ కల్పిస్తుంది అంటూ వాదులాటకి దిగాడు. మాస్క్ ధరించకపోతే ప్లేన్ నుంచి దించేయాల్సి వస్తుంది అంటూ విమాన సిబ్బంది హెచ్చరించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి వినిపించుకోలేదు. దీనితో.. సిబ్బంది అతనిని ప్లేన్ నుంచి గెంటేశారు. అంతే కాదు అతను ఇకపై యునైటెడ్ ఎయిర్లైన్స్ సర్వీసెస్ ప్లేన్స్ లో ఎక్కడానికి వీలు లేదని అతనిపై బ్యాన్ కూడా విధించారు. దీనితో సదరు వ్యక్తి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.


End of Article

You may also like