Ads
ఇటీవల ఆత్మహత్యలు ఎక్కువ గా చోటు చేసుకుంటున్నాయి. ఒత్తిడి భరించలేక కొందరు, ఉద్యోగాల బాధలతో మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా తన భార్య కు వైద్య చికిత్సలు చేయించలేకపోతున్నానన్న బాధ తో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన కుమార్తె తో కలిసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికం గా కలకలం రేపుతోంది.
Video Advertisement
న్యూస్ 18 కథనం ప్రకారం… విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధి లో శ్రీనగర్ కాలనీ కి చెందిన రవి హైదరాబాద్ లోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. అయితే, కరోనా నేపధ్యం లో అతని ఉద్యోగం పోవడం తో విజయవాడ కు వచ్చేసాడు. అతనికి కి భార్య భరణి, కుమార్తె గీతా సహస్ర ఉన్నారు. అతని భార్య భరణి కొంత కాలం గా మూత్రపిండాల వ్యాధి తో బాధపడుతున్నారు.
అయితే, ఆమె చికిత్స నిమిత్తం గవర్నర్ పేట లోని తన పుట్టింటిలోనే ఉంటున్నారు. ఈ క్రమం లో రవి కుమార్తె గీతా సహస్ర తో కలిసి సత్యనారాయణపురం లోనే ఉంటున్నాడు. గత శనివారం ఉదయం రవి బామ్మరిది మధుబాబు ఎన్ని సార్లు ఫోన్ చేసినా రవి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీనితో, మధుబాబు కంగారు పడి సత్యనారాయణ పురం లోని రవి ఇంటికి వచ్చి చూసాడు.
ఉరికి వేలాడుతూ రవి, మంచం పైన గీత సహస్ర నిర్జీవం గా పడి ఉండడం చూసి ఖంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మరో వైపు ఆ మృతదేహాలు అనుమానాస్పదం గా ఉన్నాయి. ఆ బాలిక నోటి పై ప్లాస్టర్ ఉండడం.. రవి ముఖానికి కూడా నల్లటి వస్త్రం కప్పి ఉంది. కాళ్ళు, చేతులు కట్టివేసి ఉండడం తో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు గదిలో నాలుగు లేఖలు కూడా కనిపించాయి. తన కిడ్నీలు భరణి కి అమర్చాలని, ఇతర అవయవాలను అవసరం ఉన్నవారికి దానం చేయాలనీ అతను కోరాడు. మరో లేఖ లో ” నిన్న అందరు వచ్చినా నాతొ ఎవరు మాట్లాడలేదు.. సారీ బుజ్జి.. నువ్వు బెటర్ లైఫ్ కావాలనుకున్నావ్.. ఈ ఒంటరితనాన్ని కాదు. నా కిడ్నీలు నా భార్య భరణి కి ఇవ్వండి. ఇతర అవయవాలు కావాల్సిన వారికి ఇవ్వండి” అని రాసాడు.
మరో లేఖ లో “మామ్మ ఐ నీడ్ హెల్ప్” అని రాసాడు.. మరో పేపర్ పై లవ్ యు ఉమా పిన్ని, లవ్ యు అమ్మమ్మ, లవ్ యు బుజ్జి తల్లి, సారీ తల్లి” అని రాసి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
End of Article