రైలు ప్రయాణం లో గోల్డ్ చైన్ పోగొట్టుకున్నాడు.. 14 ఏళ్ళ తరువాత అది తిరిగొచ్చింది.. ఎలా అంటే..?

రైలు ప్రయాణం లో గోల్డ్ చైన్ పోగొట్టుకున్నాడు.. 14 ఏళ్ళ తరువాత అది తిరిగొచ్చింది.. ఎలా అంటే..?

by Anudeep

Ads

ఫోన్, బాగ్, గోల్డ్ వస్తువులు వంటివి మనం చాలా జాగ్రత్త గా చూసుకోవాలి. ఎందుకంటే దొంగలు ఎక్కువ సార్లు వీటినే టార్గెట్ చేస్తుంటారు. వీటిని మనం ఎక్కడైనా మర్చిపోయినా, లేదా దొంగతనం చేయబడినా తిరిగి దొరకడం చాలా కష్టం కూడా. అయితే, ఎప్పుడైనా పోగొట్టుకున్న బంగారం మనకి తిరిగి దొరికితే అదృష్టం గా భావిస్తాం. కష్టించి చేయించుకున్న బంగారమైతే.. తప్పకుండ తిరిగొస్తుందని కూడా మనలో చాలా మంది నమ్ముతుంటారు. అలా.. ఓ వ్యక్తి తాను 14 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న బంగారాన్ని పోలీసులు తెచ్చి ఇచ్చారు.. ఆ స్టోరీ ఏంటో.. ఓ లుక్ వేయండి.

Video Advertisement

gold chain 1

పోలిసుల కధనం ప్రకారం సురేశ్ సవాలియా అనే రిటైర్డ్ బిజినెస్ మాన్ ఓ రైలు లో ప్రయాణం చేసారు. ఆయన తనతో పాటు ఓ బాగ్ ను కూడా ఉంచుకున్నారు. ఆ బాగ్ లో కొంత డబ్బు.. 22 గ్రాముల గోల్డ్ చైన్ కూడా ఉంది. అయితే, రైలు లో ప్రయాణిస్తున్న టైం లో తన బాగ్ మిస్ అవడం గుర్తించి బొలివరీ స్టేషన్‌ వద్ద రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే, ఆ తరువాత దీనిపై ఆశలు కూడా వదిలేసుకున్నారు. 14 సంవత్సరాల తరువాత పోలీసులు ఈ బంగారాన్ని గుర్తించారు.

golda chain 2

ఈ బంగారాన్ని దొంగతనం చేసిన వ్యక్తి దానిని జ్యువలరీ షాప్ లో అమ్మివేశాడు. సదరు యజమాని ఈ బంగారాన్ని కరిగించి 22 గ్రాముల బిస్కట్ గా చేసారు. ఆ బిస్కట్ నే పోలీసులు తీసుకొచ్చి సురేశ్ సవాలియా కు అప్ప చెప్పారు. రైలు ప్రయాణాల్లో దొంగతనాలు ఎక్కువ గానే జరుగుంటాయి. గతేడాది కూడా రూ.4.5 కోట్ల విలువైన వస్తువులు చోరీ కి గురి అయ్యాయి. వీటిని రైల్వే పోలీసులు వెతికి పట్టుకుని వాటి యజమానులైన 3,400 మందికి అప్పచెప్పారు. రైల్వే పోలిసుల సేవలకు పలువురు ప్రయాణికుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.


End of Article

You may also like