Home News భార్య ఫోటోను వాట్సాప్ డీపీ గా పెట్టుకున్న భర్త.. ఆ తర్వాత జరిగింది చూసి షాక్..! అసలేమైందంటే?

భార్య ఫోటోను వాట్సాప్ డీపీ గా పెట్టుకున్న భర్త.. ఆ తర్వాత జరిగింది చూసి షాక్..! అసలేమైందంటే?

by Anudeep

ఇటీవలి కాలంలో వాట్సాప్ వాడకం కాస్త ఎక్కువ గానే ఉంటోంది. చిన్నా, పెద్ద వయసు తేడా లేకుండా అందరు ఉపయోగిస్తున్నారు. ఎక్కడ ఉన్నా సరే చిటికలో కమ్యూనికేషన్ చేసుకునే సదుపాయం ఉండడంతో అందరు తమ ఫ్రెండ్స్ మరియు సన్నిహితులతో మెసేజ్ చేసుకోవడానికి వాట్సాప్ పై ఆధార పడుతున్నారు.

కానీ, టెక్నాలజీ వలన సదుపాయాలతో పాటు అనర్ధాలు కూడా వస్తున్నాయి అని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఇంటర్నెట్ వాడే విషయంలో జాగ్రత్తలు వహించాలని ఈ సంఘటన పాఠం నేర్పిస్తుంది.

whatsapp dp 2

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ భర్త తన భార్య పైన ఉన్న ప్రేమతో ఆమె ఫోటోను డిపిగా పెట్టుకున్నాడు. అయితే.. ఓ సైబర్ నేరగాడు ఆ డిపి ను డౌన్లోడ్ చేసుకుని ఆమెను నగ్నం గా ఉన్నట్లు మార్ఫింగ్ చేసి సదరు భర్తని బెదిరించడం స్టార్ట్ చేసాడు. తాను అడిగినంత డబ్బుని ఇవ్వకపోతే నీ భార్య నగ్న ఫోటోలను బయటకు విడుదల చేస్తానంటూ బెదిరించాడు. దీనితో సదరు భర్త పోలీసులను ఆశ్రయించాడు. కాగా.. అతని గోడు విన్న సైబర్ క్రైం విభాగం పోలీసులు సదరు కేటుగాడ్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

whatsapp dp 1

అతని ఐపి అడ్రస్ ద్వారా అతని ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోవైపు సదరు భర్తకి తెలిసిన వ్యక్తులే ఇటువంటి పని చేస్తూ ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు సదరు సైబర్ నేరగాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజులు మంచిగా లేవని, ఇంట్లోని ఆడవారిపై ప్రేమతోనో, అభిమానంతోనో వారి ఫోటోలను డీపీలుగా పెట్టకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో ఎంత పురోగతి సాధించిన అప్రమత్తతతో ఉండాలని హెచ్చరిస్తున్నారు.

You may also like