భర్త తలకి బోను పెట్టి తాళం వేస్తున్న భార్య.. అసలు కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

భర్త తలకి బోను పెట్టి తాళం వేస్తున్న భార్య.. అసలు కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

by Anudeep

Ads

ఈ కింద ఫోటోని గమనించారా..? హ్యాపీగా కనిపిస్తున్న ఫ్యామిలీ లో ఒక వ్యక్తి తలకి మాత్రం బోను లాంటిది కనిపిస్తుంది కదా. ఆ బోనుకి తాళం కూడా వేసి వుంది. ఇదంతా సదరు వ్యక్తి భార్యే చేస్తుందట. తన భర్త తలకి బోను పెట్టేసి దానికి తాళం వేసి, ఆ తాళం కూడా తన దగ్గరే ఉంచుకుంటుందట. రోజంతా ఆ భర్త ఇలానే బోనుకు తాళం వేయించుకుని ఉంటాడట.

Video Advertisement

అయితే దీనికి ఆ భర్త కూడా సపోర్ట్ చేస్తారట. ఆశ్చర్యం గా ఉంది కదా. ఇక అసలు విషయం ఏంటో తెలుసుకోండి. సదరు వ్యక్తి పేరు ఇబ్రహీం. టర్కీకి చెందిన ఇబ్రహీం కు ఎక్కువగా సిగరెట్లు తాగే అలవాటు ఉందట.

man 1

ఒకటి రెండు కాదు.. ఏకంగా రెండు డబ్బాల సిగరెట్లను ఒక్క రోజులో తాగేస్తాడట ఇబ్రహీం. అయితే.. ఈ అలవాటుని మార్చుకోవాలని ఇబ్రహీం చాలానే ప్రయత్నిస్తున్నాడట. 16 సంవత్సరాల వయసులోనే ఇబ్రహీం సిగరెట్లు తాగడం అలవాటు చేసుకున్నాడట. అప్పటి నుంచి ఎంత మానాలని ట్రై చేస్తున్నా మానలేకపోతున్నాడు. అతని తండ్రికి కూడా సిగరెట్లు తాగే అలవాటు ఉంది.

man 2

ఆ కారణంగా అతని తండ్రి లంగ్ కాన్సర్ తో మరణించాడట. దీనితో ఇబ్రహీం తన ఫ్యామిలీ క్షేమం కోసం సిగరెట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. అయితే.. సిగరెట్లని మాత్రం మానేయలేకపోయేవాడట. దీనితో తలకి బోను బిగించుకుని దానికి తాళం వేసి.. ఆ తాళాన్ని తన భార్యకే ఇచ్చేస్తాడట. తన ఫ్యామిలీ కోసం ఇలాంటి త్యాగాలు చేయక తప్పదని ఇబ్రహీం చెబుతున్నాడు.


End of Article

You may also like