Home News ప్రేమించిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు…ఇద్దరు భార్యలు ఆ భర్తను ఎలా పంచుకున్నారో తెలుసా.?

ప్రేమించిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు…ఇద్దరు భార్యలు ఆ భర్తను ఎలా పంచుకున్నారో తెలుసా.?

by Anudeep

ఈ మధ్య అబ్బాయిలకి ఒక్క అమ్మాయి దొరకడమే కష్టం గా ఉంటె కొందరు మాత్రం రెండు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆల్రెడీ వివాహం అయిపోయిన ఓ యువకుడు మరో అమ్మాయిని ప్రేమించి గర్భవతి ని చేసాడు. ఈ విషయం బయటకు వచ్చాక.. ఆ యువకుడు, ఇద్దరు యువతులు కాంప్రమైజ్ అయ్యారు. దీనితో సదరు యువకుడు ప్రేమించిన అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నాడు.

man married second time 1

వ్విఅరల్లోకి వెళ్తే, రాంపూర్‌లోని ధోంక్‌పురి తండా వద్ద నివసించే ఓ యువకుడికి వివాహమైంది. కొంతకాలం తరువాత ఆ యువకుడు ఫేస్ బుక్ లో పరిచయం అయిన అస్సాం కు చెందిన యువతీ ని ప్రేమించాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమించడం తో.. ఇతను అస్సాం కు వెళ్ళిపోయి కొంతకాలం అక్కడే ఉన్నాడు. వీరిద్దరూ సహజీవనం చేసారు. ఆ అమ్మాయి గర్భవతి కావడం తో సదరు యువకుడు కంగారు పడి పారిపోయి తన భార్య వద్దకు వచ్చేసాడు.

man married second time 2

ఆ యువతీ మాత్రం ఇతడిని మరిచిపోలేదు. ఈ యువకుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది. రాంపూర్ కి వచ్చి ఆ ఊరి గ్రామ పెద్దలకు తన పరిస్థితి ని వివరించింది. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకోగా.. విషయం అందరికి అర్ధమైంది. చివరికి ప్రేయసిని కూడా సదరు యువకుడు పెళ్లి చేసుకున్నాడు. చేసేదేమి లేక ఆ మొదటి భార్య కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంది.

man married second time 3

అయితే.. ఇప్పుడు అసలు సమస్య ఏంటి అంటే ఎవరితో ఉండాలి అని. చర్చ తరువాత.. వారం లో మూడు రోజులు మొదటి భార్య వద్ద, మూడు రోజులు రెండవ భార్య వద్ద.. మిగిలిన ఒక రోజు తల్లి తండ్రుల వద్ద ఉండాలని నిర్ణయించారు.

You may also like