లవర్ అంటే ఇలా ఉండాలి.. దివ్యాంగురాలైన ప్రేయసిని చేతులతో ఎత్తి మోసుకొచ్చిన ప్రియుడు..!

లవర్ అంటే ఇలా ఉండాలి.. దివ్యాంగురాలైన ప్రేయసిని చేతులతో ఎత్తి మోసుకొచ్చిన ప్రియుడు..!

by Anudeep

Ads

ఈ మధ్య కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే.. అమ్మాయిలు ప్రేమకు ఒకే చెప్తే సరే ఉంది.. లేదంటే గొడవ పడడం.. యాసిడ్ దాడులకు పాల్పడడం, ఇవి కాకుండా అఘాయిత్యాలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు.

Video Advertisement

ఈ క్రమంలో అమ్మాయిలు కూడా లెక్కలేనన్ని వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే.. ఈ జంట మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు అసలైన ప్రేమకు నిదర్శనంగా నిలిచాడు.

lover 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఇల్లెందు అనే గ్రామానికి చెందిన మూతి వసంతరావు(22) మణుగూరుకు చెందిన దివ్యాంగురాలు నరసమ్మ (21)ను ప్రేమించాడు. వసంత రావు డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. గతేడాది ఓ వివాహ వేడుకలో నరసమ్మను చూసాడు. ఇద్దరు మాట మాటా కలుపుకోగా.. ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం ప్రేమగా మారింది.

lover 2

నరసమ్మ కాళ్లలో సమస్య వలన నడవలేదు. కేవలం చేతుల సాయంతోనే ముందుకు సాగుతూ ఉంటుంది. ఆమె తన తల్లిదండ్రులు, సోదరుణ్ని కోల్పోయింది. ఈ క్రమంలో వదిన దగ్గరే ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది. టైలరింగ్ నేర్చుకుని ఉపాధి పొందుతోంది. ఈమెను పెళ్లి చేసుకోవాలని వసంతరావు నిర్ణయించుకున్నాడు. కాని.. ఆ పిల్లను ఎందుకు అంటూ బంధువులు అడ్డుపడ్డారు.

lovers 3

కాని.. తాను ఆమెను నిజంగా ప్రేమిస్తున్నానని.. అయినా కలిసి బతకడానికి మనసులే ముఖ్యం తప్ప శరీరాలు కాదని బంధువులను ఒప్పించాడు. మరోవైపు నరసమ్మ బంధువులు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. దీనితో.. వీరు దివ్యాంగ ఉద్యోగుల సంఘాన్ని ఆశ్రయించారు. వారంతా కలిసి వీరికి కొత్తగూడెం రుద్రంపూర్‌లోని దేవాలయంలో వివాహం జరిపించారు. ఈ సందర్భంగా వసంత రావు నరసమ్మను చేతుల్లో ఎత్తుకుని దేవాలయం పైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతైనా ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం గ్రేట్ కదా.


End of Article

You may also like