Ads
ప్రస్తుత కాలం లో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం తో పెళ్లి కానీ యువకుల సంఖ్య పెరిగిపోతోందన్న విషయం మనకి తెలిసిందే. ఇటీవల పెళ్లి కోసం పదుల సంఖ్యలో యువకులు పాదయాత్ర చేయడం మనం చూసాం.. అయితే ఒకే మండపం లో ఒక యువకుడు ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన శుభలేఖ వైరల్ గా మారింది .
Video Advertisement
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్య, రామలక్ష్మి దంపతుల కుమారుడు సత్తిబాబు ఒకేసారి ఇద్దరిని పెళ్లాడబోతున్నట్లు వెడ్డింగ్ కార్డులో కనిపిస్తుంది. వరుడి స్వగ్రామమైన ఎర్రబోరులో గురువారం ఉదయం 7.04 గంటలకు విహహం జరగనున్నట్లు పెళ్లి పత్రికలో కనిపిస్తుంది. ఒకే వ్యక్తి ఇద్దరిని ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకుంటుండటంతో ఇది వైరల్‌గా మారింది.
చర్ల మండలంలోని దొసిళ్లపల్లి గ్రామానికి చెందిన సోడి వెంకటేశ్వర్లు, సమ్మక్క దంపతుల కుమార్తె స్వప్నకుమారి, అదే మండలంలోని కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్ప సత్యనారాయణ, రుక్మిణి దంపుతుల కుమార్తె సునీతలను సత్తిబాబు పెళ్లాడనున్నట్లు ఆహ్వాన పత్రికలో ఉంది. అయితే సత్తిబాబు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. అతడు గతం లో సునీత, స్వప్న కుమారి అనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు.
స్వప్నతో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు భావించగా.. సునీతకు ఈ విషయం తెలిసి ప్రియుడిని నిలదీసింది. దీంతో సంవత్సరం క్రితం నుంచి స్వప్న, సునీత ఇద్దరితో కలిసి సత్తిబాబు తన ఇంట్లో కాపురం చేస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సత్తిబాబు కోయ గిరిజన జాతికి చెందిన వాడు. ఆ తెగకు చెందినవారు కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. సత్తిబాబుకు ఏడాది కాపురం చేసిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అందుకే ఇప్పుడు బంధువులు, కుటుంబసభ్యులందరి సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
End of Article