Ads
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం చనిపోయి పాతిపెట్టినట్లు భావిస్తున్న 52 ఏళ్ల వ్యక్తి సోమవారం ఎరోడ్ లోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. దీనితో కుటుంబ సభ్యులంతా మొదట షాక్ అయినా తర్వాత సంతోషపడ్డారు. దాదాపు రెండు నెలల క్రితమే తురైయంపాలెంకు చెందిన మూర్తి అనే వ్యక్తి కనిపించలేదు.
Video Advertisement
దీనితో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీనితో పోలీసులు తమ వెతుకులాట ప్రారంభించారు. కాగా, మార్చి 31న సత్యమంగళం బస్టాండ్ సమీపంలో మూర్తి శరీరాన్ని పోలిన వ్యక్తిని గుర్తించారు.
దీనితో, వారు కుటుంబ సభ్యులను సన్నిహితులను పిలిపించారు. కాగా, మూర్తి ఇద్దరు కుమారులు ఆ వ్యక్తిని చూసి తమ తండ్రే అని భావించారు. చేసేది లేక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. కర్మ కాండల తరువాత మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేసారు. సోమవారం రాత్రి మూర్తి ఇంటికి తిరిగి రావడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. కర్నాటక చెరకు కోత కోసం వెళ్లినట్లు మూర్తి వివరించారు. కుటుంబ సభ్యులు అతడిని బంగలపుదూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు తెలిపారు.
వారింకా మిస్సింగ్ కేసును నమోదు చేయలేదని.. వారంతట వారే మూర్తి కోసం వెదికారని చెప్పుకొచ్చారు. అయితే పోలీసులకు కనిపించిన మృతదేహం వారి తండ్రి యొక్క శరీరాన్ని పోలి ఉండడంతో.. వారు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు. అయితే.. అతను తిరిగి వచ్చినప్పుడు మాకు సమాచారం అందించారని, దీనితో రెవెన్యూ అధికారుల సమక్షంలోనే మృతదేహాన్ని వెలికి తీశామని చెప్పుకొచ్చారు. అయితే ఆ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించగా అనుమానాస్పద మృతిగా నమోదు చేశామని, ప్రస్తుతం అతని గుర్తించే పనిలో పడ్డామని పోలీసులు తెలిపారు.
End of Article