Ads
భార్య భర్తలు అన్నాక ఏవో ఒక చిన్నపాటి గొడవలు, మాట తేడాలు, అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి. అయితే.. వాటిని పరిష్కరించుకుంటూ..ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే..కొన్నిసార్లు గొడవలు తీవ్ర స్థాయిలో ఉన్న సమయం లో కొందరు విడిపోవడానికి కూడా సిద్ధపడుతుంటారు. అలానే ఓ భార్య.. భర్తతో గొడవ పడి ఈ భర్త నాకు వద్దంటూ కేసు పెట్టింది.
Video Advertisement
ఆ తరువాత ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతం లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ భర్త పెద్దలతో మాట్లాడి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. వీరిద్దరి మధ్యా రాజి కుదరలేదు. పోలీసులు కూడా ఆమెకు నచ్చచెప్పి కౌన్సెలింగ్ కు పంపారు. అయినా సరే ఆమె మాట వినలేదు. తనకు ఈ భర్త వద్దే వద్దంటూ గొడవ చేసింది.
అయితే.. ఆ భర్త ఉన్నట్లుండి పాట అందుకున్నాడు. బద్లాపూర్ సినిమా లో ని ఓ పాటను స్టేషన్లోనే సదరు భర్త ఆలపించి ఆమె ప్రేమను పొందడానికి ప్రయత్నించాడు. అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె కూడా అతని ప్రేమకి ఫిదా అయింది. అతని భుజాలపై వాలి కన్నీటిపర్యంతమైంది. అక్కడ ఐపీఎస్ మధుర్ వర్మ ఈ సీన్ ను వీడియో తీసి ట్విట్టర్ లో ఉంచారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది.
A couple had a fight.
Few months back, wife filed a case against her husband in Jhansi.
But husband sang a song for her in the police station and convinced her. Love triumphs pic.twitter.com/2frzPOKpGn— Madhur Verma (@IPSMadhurVerma) November 14, 2017
End of Article