రూ.70వేల స్కూటీ కోసం రూ.15.44లక్షలు ఖర్చు చేసాడు.. ఒక్క స్కూటీకి అంత ఎందుకు పెట్టాడంటే?

రూ.70వేల స్కూటీ కోసం రూ.15.44లక్షలు ఖర్చు చేసాడు.. ఒక్క స్కూటీకి అంత ఎందుకు పెట్టాడంటే?

by Anudeep

Ads

ప్రస్తుతం ఉన్న రోజుల్లో స్కూటీకి కూడా బాగానే డిమాండ్ ఉంది. ట్రాఫిక్ రోడ్స్ పై సులువుగ వెళ్ళిపోడానికి అనువుగా ఉండే స్కూటీ అందరికి అందుబాటులో ధరలోనే ప్రస్తుతం ఉన్న రోజుల్లో స్కూటీకి కూడా బాగానే డిమాండ్ ఉంది. ట్రాఫిక్ రోడ్స్ పై సులువుగ వెళ్ళిపోడానికి అనువుగా ఉండే స్కూటీ అందరికి అందుబాటులో ధరలోనే లభిస్తూ ఉంటుంది. ఒక స్కూటీ ఖరీదు ఎంత ఉంటుంది.. మహా అయితే డెబ్భై వేల రూపాయలు ఉంటుంది.

Video Advertisement

అయితే.. ఈ వ్యక్తి మాత్రం ఒక స్కూటీని ఏకంగా రూ.15.44లక్షల రూపాయలను ఖర్చు చేసి కొనుక్కున్నాడు. అసలు.. డెబ్భై వేల స్కూటీకి అంత ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెల్సుకుందాం.

scooty 1

సదరు వ్యక్తి పేరు బ్రిజ్ మోహన్. అతను చండీఘర్ నివాసి. కొన్ని రోజుల క్రితమే స్కూటీని కొనుక్కున్నాడు. ఇందుకోసం డెబ్భై వేల రూపాయలను ఖర్చు చేసాడు. అయితే.. కొన్ని రోజులకే ఒక ఫాన్సీ నెంబర్ ప్లేట్ వేలానికి వచ్చింది. దీనితో ఆ నెంబర్ ప్లేట్ ను కొనుగోలు చేయాలని భావించాడు. ఇక్కడ ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే ఆ స్కూటీ కంటే నెంబర్ ప్లేట్ ఖరీదు చాలా ఎక్కువ.

scooty 2

వేలంలో ఆ నెంబర్ ప్లేట్ కోసం మోహన్ రూ.15.44లక్షల రూపాయలను ఖర్చు చేసాడు. ఈ నెంబర్ ప్లేట్ CH-01 CJ 0001 అనే నంబర్లతో ఫాన్సీ గా ఉండడం వల్లనే ఆ నెంబర్ ప్లేట్ కి అంత డిమాండ్ ఏర్పడింది. పిల్లల కోరిక మేరకే ఈ నెంబర్ ప్లేట్ ను కొనుగోలు చేసానని.. మరి కొన్ని రోజులలో ఓ కార్ ను కొనుగోలు చేసి ఈ నెంబర్ ప్లేట్ ను దానికి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే డెబ్భై వేల బండికి అన్ని లక్షలు పోసి నెంబర్ ప్లేట్ కొనుక్కోవడం మాత్రం సోషల్ మీడియాలో సంచలనానికి తెర లేపింది.


End of Article

You may also like