Ads
ప్రేమ గుడ్డిది అంటుంటారు. ప్రేమ లో ఉన్నపుడు ఏమి చేస్తూంటామో మనకే తెలియదు. ఒక్కోసారి ఆలోచించకుండా చేసే పనులు అనర్ధాలకు దారి తీస్తాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఇటీవల, దుబాయ్‌కు చెందిన ఒక వ్యక్తి విలువైన బేబీ కామెల్ (ఒంటె) ను దొంగిలించి పుట్టినరోజున తన స్నేహితురాలికి బహుమతిగా ఇచ్చాడు. కానీ అతను చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
Video Advertisement
స్థానిక జాతీయ వార్తాపత్రిక ప్రకారం, ఈ నెల ప్రారంభంలో బేబీ కామెల్ యజమానులు ఈ దొంగతనం జరిగినట్లు దుబాయ్ పోలీసులకు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేయాలనీ కోరారు. చాలా రోజుల తరువాత, ఒక వ్యక్తి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పొలంలో విచ్చలవిడిగా ఒంటె తిరుగుతోందని అధికారులకు విన్నవించాడు. అయితే, పోలీసులు ఈ విషయమై లోతు గా విచారించిన తరువాత, ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడని పోలీసులకు అర్ధమైంది. ఈ కేసుని మరింత లోతు గా పరిశీలించారు.
ఆ తరువాత పోలీసులకు అర్ధమైంది ఏమిటంటే.. ఆ వ్యక్తి తన పుట్టినరోజున తన స్నేహితురాలికి బహుమతిగా ఇవ్వడానికి అరుదైన జాతికి చెందిన మరియు చాలా ఖరీదైన ఒంటెను దొంగిలించానని ఒప్పుకున్నాడు. అతను ఒంటెను దొంగిలించడానికి తన పొరుగువారి పొలంలోకి వెళ్లినట్లు కూడా ఒప్పుకున్నాడు. అతను మొదట బుకాయించినప్పటికీ.. తరువాత వాదించలేక నిజం ఒప్పేసుకున్నాడు.ఆ తరువాత పోలీసులు ఆ బేబీ కామెల్ ను దాని యజమానులకు అప్పగించేశారు. దొంగతనం చేయడం, తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను సదరు వ్యక్తి, మరియు అతని గర్ల్ ఫ్రెండ్ ను అరెస్ట్ చేసినట్లు యుఎఇ పేపర్ నేషనల్ పేర్కొంది.
End of Article