Ads
విమానం లో టికెట్లు కొనాలంటే చాలా ఖరీదు. అదే ఫ్లైట్ మొత్తం మనం ఒక్కళ్ళమే బుక్ చేసుకోవాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. కానీ ఓ వ్యక్తి మాత్రం కేవలము 18 వేలకే ముంబై నుంచి దుబాయ్ కి 360 సీటింగ్ సామర్ధ్యం ఉన్న బోయింగ్ ఫ్లైట్ లో ప్రయాణించాడు. అది ఎలానో తెలుసా..? సాధారణ ఎకానమీ టికెట్ కొనుగోలు చేయడం ద్వారా. కాకపోతే అతనికి లక్ కలిసి వచ్చింది.
Video Advertisement
మే 19 న ఈ ఘటన జరిగింది. భవేశ్ జవేరి దుబాయ్ లో రెండేళ్లు గా ఉంటున్నారు. ప్రస్తుతం కరోనా ఆంక్షల కారణం గా దుబాయ్ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసా ఉన్నవారు, దౌత్యవేత్తలకు తప్ప ఎవరికీ దుబాయ్ లోకి అనుమతి లేదు. ఈ క్రమం లో జవేరి ముంబై నుంచి దుబాయ్ కి వెళ్లాలనుకున్నారు. టికెట్ పై తేదీ వేరే ఉన్న కారణం గా వారు ఫ్లైట్ లోకి అనుమతించలేదు. దీనితో ఆ వ్యక్తి దుబాయ్ ఎమిరేట్స్ కు కాల్ చేసాడు. వారు..”ఈరోజు ఫ్లైట్ లో ప్రయాణించేది తానొక్కడే అని.. తనకోసమే ఎదురు చూస్తున్నామని..” చెప్పడం తో జవేరి షాక్ అయ్యాడు. అలా.. జవేరి కి ఫ్లైట్ లో ఒక్కడే ప్రయాణించే ఛాన్స్ దొరికింది.
End of Article