చేతకాని పనిని గొప్పలకు పోయి చెయ్యాలనుకుంటే ఇలానే అవుతుంది.. వైరల్ అవుతున్న వీడియో..!

చేతకాని పనిని గొప్పలకు పోయి చెయ్యాలనుకుంటే ఇలానే అవుతుంది.. వైరల్ అవుతున్న వీడియో..!

by Anudeep

Ads

మనకి బాగా వచ్చిన పనిని ఫ్రీగా చేయకూడదు. అలానే అస్సలు చేతకాని పనిలో వేలు పెట్టకూడదు. ఎంత దూరం వెళ్లినా.. ఎంత అభివృద్ధి చెందినా ఈ సూక్ష్మ నీతిని మాత్రం మర్చిపోకూడదు. అలా చెయ్యకుండా.. ఓ వ్యక్తి ఎలా ఇబ్బందుల్లో పడ్డాడో ఈ వైరల్ వీడియో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

Video Advertisement

ఓ వ్యక్తి తనకు చేతకాని పనిని చేయడానికి సాహసం చేసాడు. సరిగ్గా చేయలేకపోగా ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. ఏ మాత్రం తేడా జరిగినా అతను తన ప్రాణాలను కోల్పోయేవాడు.

dam

వివరాల్లోకి వెళితే, చిక్కబళ్లాపూర్ కు చెందిన సాగర్ డామ్ ను ఓ ఇరవై ఏళ్ల యువకుడు అందరు చూస్తుండగా అధిరోహించాలని అనుకున్నాడు. దానికి తగ్గట్లే ప్రయత్నం కూడా మొదలు పెట్టాడు. చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అతనిని ఆపడం మానేసి ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు. అయితే.. అతను ఎక్కుతుండగా.. పొరపాటున పట్టు తప్పింది.

dam 1

పట్టు తప్పడంతో.. అతను అమాంతం అంత ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. ఏదో సాహసం చేద్దాం అనుకుని.. ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఈ ఇరవై ఏళ్ల కుర్రాడు. బెంగళూరు నుంచి 74 కి.మీ దూరంలో ఉండే ఈ డామ్ పై ఇలాంటి సాహసం చేయడానికి అనుమతి లేదు. అయినప్పటికీ ఈ కుర్రాడు ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఈ డామ్ ఆనకట్ట గోడ దాదాపు 50 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ కుర్రాడు 25 అడుగుల ఎత్తు వరకు వెళ్లి అక్కడనుంచి కిందకు పడిపోయాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనుమతి లేని చోట సాహసం చేయాలనీ ప్రయత్నించినందుకు అతనిపై కేసు నమోదైంది.


End of Article

You may also like