Ads
కొన్ని సంఘటనలు మనలని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటాయి. అయితే ఈ సంఘటనల పరిణామాలని చూస్తే ఒక్కోసారి జాలి కలుగుతూ ఉంటుంది. అలాంటి సంఘటనే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మదనపల్లిలో చోటు చేసుకుంది. ఇంటర్ లో పరిచయమైన స్నేహం ప్రేమగా మారింది. ఇందులో విచిత్రం ఏమీ లేదు. కానీ స్నేహం ప్రేమగా మారింది ఇద్దరు అబ్బాయిల మధ్య.
Video Advertisement
ఏపీలోని మదనపల్లి మండలం వెంగంవారిపల్లె కు చెందిన ఓ కాలేజీలో అదే గ్రామానికి చెందిన లోకేష్ కు ములకలచెరువు మండలం పత్తికోటకు చెందిన మహేష్ కు పరిచయం ఏర్పడింది.
వీరు మదనపల్లి లోనే ఇంటర్ పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ తరువాత వారిద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. చివరకు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనితో లోకేష్ ను అమ్మాయిగా మారాలంటూ మహేష్ కోరడంతో లోకేష్ కూడా అందుకు అంగీకరించాడు. స్వీటీ గా మారిపోయాడు. ఆ తరువాత వీరిద్దరూ ఆరేళ్ళ పాటు సహజీవనం చేసారు.
అయితే ఉన్నట్లుండి మహేష్ లో మార్పు వచ్చింది. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని.. తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. దీనితో షాక్ అయిన స్వీటీ పోలీసులను ఆశ్రయించింది. లోకేష్ కోసం తాను మగతనాన్ని త్యాగం చేసానని.. కానీ నన్ను అన్యాయం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరినీ పిలిపించి విచారిస్తున్నారు.
End of Article