కల్కి పాట ప్రోమోలో… ప్రభాస్ తో పాటు కనిపించిన ఈ “దిల్జిత్ దోసంజ్” ఎవరు..? ఎందుకు ఇతనికి అంత మంది అభిమానులు ఉన్నారు..?

కల్కి పాట ప్రోమోలో… ప్రభాస్ తో పాటు కనిపించిన ఈ “దిల్జిత్ దోసంజ్” ఎవరు..? ఎందుకు ఇతనికి అంత మంది అభిమానులు ఉన్నారు..?

by Mohana Priya

Ads

ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా నుండి పాట విడుదల అవుతున్నట్టు సినిమా బృందం ప్రకటించారు. సినిమా నుండి విడుదల అవుతున్న మొదటి పాట ఇది. చాలా భారీ ఎత్తున ఈ పాట ప్లాన్ చేశారు. ఇటీవల ఈ పాట షూట్ కూడా చేశారు. ఈ సినిమాలో కేవలం రెండు లేదా మూడు పాటలు మాత్రమే ఉన్నట్టు సమాచారం. అందులో ఇది కూడా ఒకటి. ఇది అదనంగా యాడ్ చేసిన సాంగ్ అని అంటున్నారు. ఒక పాట వల్ల సినిమా ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. కాబట్టి సినిమా బృందం ఇలా ప్లాన్ చేశారు అని అర్థం అవుతోంది. ఈ పాటలో ప్రభాస్ కనిపిస్తున్నారు. ప్రభాస్ తో పాటు మరొక వ్యక్తి కూడా కనిపిస్తున్నారు. ఆ వ్యక్తి తెలుగు వారికి కొత్త కానీ, ప్రపంచానికి మాత్రం కొత్త కాదు.

Video Advertisement

man with prabhas in kalki song promo

ఈ వ్యక్తి పేరు దిల్జిత్ దోసంజ్. దిల్జిత్ దోసంజ్ ఒక సింగర్, యాక్టర్ కూడా. పంజాబీ పాటలతో తన కెరీర్ మొదలుపెట్టి, తర్వాత బాలీవుడ్ సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. పంజాబీ సినిమాల్లో, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. ఇటీవల చమ్కీలా అనే ఒక సినిమాలో నటించారు. నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో దిల్జిత్ నటించడం మాత్రమే కాకుండా పాడారు కూడా ఇప్పుడు కల్కి సినిమాతో తెలుగు వారికి కూడా పరిచయం అవుతున్నారు. ఈ పాటని పంజాబీ భాషలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. మరి పాట మొత్తం అలాగే ఉంటుందా? లేదా కేవలం ప్రోమో మాత్రమే ఇలా ఉంటుందా? ఇది తెలియాలి అంటే పాట విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.

ఇవాళ ప్రోమో విడుదల చేశారు. రేపు పాట విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజుల నుండి కల్కి బృందం నుండి ఎటువంటి సౌండ్ లేదు. అసలు ప్రమోషన్స్ లేవు అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటి సమయంలో బుజ్జి అనే ఒక వీడియో విడుదల చేసి, ఆ తర్వాత దాని మీద ఒక సిరీస్ విడుదల చేసి, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చి, ట్రైలర్ విడుదల చేసి, ఇప్పుడు ఒక పాట కూడా రిలీజ్ చేస్తున్నారు. మొదట సైలెంట్ గా ఉండి తర్వాత ప్రమోషన్స్ చేయాలి అని సినిమా బృందం ప్లాన్ చేసినట్టు ఇవి చూస్తే తెలుస్తోంది. సినిమా ట్రైలర్ ఆసక్తిని క్రియేట్ చేసింది. దాంతో సినిమా గురించి అందరూ ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like