ఆ యూనివర్సిటీ ప్రకారం మనం ఇప్పటికే పీక్ గండం దాటేశామట.

ఆ యూనివర్సిటీ ప్రకారం మనం ఇప్పటికే పీక్ గండం దాటేశామట.

by Anudeep

తానొకటి తలచినా, దైవం ఒకటి తలచును అన్నట్టు..ముక్కుతో మూలుగుతూ రెండవ విడత లాక్ డౌన్ మరో మూడు రోజుల్లో పూర్తైపోతుంది..హమ్మయ్య హమయ్య రెండు రోజులైతే లాక్ డౌన్ తీసేస్తారు అని హ్యాపీగా ఫీలవుతుంటే లాక్ డౌన్ 33 పిడుగు పడింది. మరోవైపు రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది..దీంతో అసలేం జరుగుతోందో అర్దం కాని పరిస్థితి..ఈ నేపధ్యంలో సింగపూర్ యూనివర్శిటి చేసిన వ్యాఖ్యలు ఆశాజనకంగా ఉన్నాయి.

Video Advertisement

మరీ అమెరికా, ఇటలీ స్థాయిలో బీబత్సంగా పెరగకపోయినా మన దగ్గర కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది తప్ప, తగ్గుతున్నట్టుగా అనిపించడంలేదు..కానీ సింగపూర్ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే. “ఇండియా ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ స్థాయిని దిగ్విజయంగా దాటేసింది..ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా మే చివరి వారానికి తగ్గుముఖం పడుతుందని, జూన్ మొదటి వారంలోపు 99%  తగ్గుతుందని” సింగపూర్ యూనివర్శిటి ఆప్ టెక్నాలజి అండ్ డిజైన్  ఒక నివేదిక ఇచ్చింది. జూలై 25 నాటికి 100 శాతం కరోనా ఫ్రీ దేశంగా భారత్ ఉండనుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ రీసెర్చర్లు ఆ రిపోర్ట్ లో తెలిపారు.

ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అయినా ఇటలీ కొద్దికొద్దిగా కోలుకుంటుంది..అమెరికాలో పరిస్థితి కూడా ఇంతకుముందు ఉన్నంత భయంకరంగా లేదనేది అర్దం అవతోంది..మరోవైపు చైనా, న్యూజిలాండ్,ఆస్ట్రేలియా,వియత్నాం కరోనా ఫ్రీ దేశాలుగా నిలుస్తున్నాయి..మన దేశంలో కూడా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కరోనా ఫ్రీ రాష్ట్రాలుగా నిలవగా, కేరళ, తెలంగాణా లాంటి రాష్ట్రాలు కరోనాని కట్టడి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

సింగపూర్ యూనివర్శిటి ఇచ్చిన నివేధిక ఎంత వరకు నిజం అవుతుందనేది సెకండరీ..కానీ ప్రజల్లో నెలకొన్న భయం ,ఆందోళనలకు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి అనేది నిజం . ఇలాంటి కామెంట్స్ సమస్యకి పరిష్కారం కాకపోవచ్చు.. కాని పాజిటివ్ కామెంట్స్  కొంత ధైర్యాన్ని ఇస్తాయి.


You may also like

Leave a Comment