Ads
హీరోయిన్ రీమా సేన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేటి తరానికి అంతగా తెలియనప్పటికీ, 90 దశకం యువతకి ఆమె డ్రీమ్ గర్ల్. తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు సినిమాలలో నటించి, మెప్పించారు.
Video Advertisement
రీమా సేన్ వివాహం తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె ఎలా ఉందో? ఏం చేస్తుందో? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమాతో రీమా సేన్ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టారు. 2000 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారారు. తెలుగులో నటిస్తూనే గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘మిన్నలే’ అనే మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తెలుగులో ‘చెలి’ పేరుతో రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ హిట్ అవడంతో కోలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసింది. హిందీలో కూడా పలు సినిమాలు చేసింది. వల్లభ, యుగానికి ఒక్కడు వంటి సినిమాలలో నెగెటివ్ పాత్రల్లో నటించి, విమర్శకుల ప్రశంసలతో పాటు, అవార్డ్స్ అందుకున్నారు. ఆమె 2012లో ఢిల్లీ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ను పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2013 లో ఈ రీమాసేన్ బాబుకు జన్మనిచ్చింది. అతని పేరు రుధ్రవీర్.రీమాసేన్ సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ, ఆమె ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో తరచుగా అభిమనులతో పంచుకుంటుంది. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అదేవిధంగా, రీమాసేన్ తన భర్త, కుమారుడు మరియు స్నేహితులతో గడిపిన స్నాప్షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
https://www.instagram.com/p/CpnrZ4do4zp/
Also Read: ప్రభాస్ కన్నా ముందు… “కల్కి” గా నటించిన హీరో ఎవరో తెలుసా..?
End of Article