Ads
మంచి వారికి చేడు చేయాలి అని చూస్తే మంచే జరుగుతుంది.ఆలా అనడానికి చాల కారణాలు ఉన్నాయి ..అందులో ఒక్కటి ఈ కథ ……..ఓ రాజు కు మూడు కళ్లున్న కూతురు పుట్టింది . ఇలా మూడు కళ్లు ఉన్న కూతురి ముఖం చూస్తే రాజుకు ప్రాణ గండముని చెబుతారు అస్థాన జ్యోతిష్యులు, కూతురికి పెళ్లీడు రాగానే ఎవరికైనా…ఇచ్చి పెళ్లి చేసి వారిని దేశాన్ని దాటించి పంపితే కానీ…ఈ ప్రాణ గండం పోదని చెబుతారు అస్థాన జ్యోతిష్యులు. పెళ్లీడుకొచ్చిన కూతురి పెళ్లి కోసం చాటింపు వేయిస్తాడు రాజు.ఎవరైనా తన కూతుర్ని చేసుకుంటే…లక్ష బంగారు నాణాలు కట్నంగా ఇస్తానని, చేసుకున్న వారు తమ రాజ్యం వదిలిపోవాలని చాటింపు వేయిస్తాడు రాజు.
Video Advertisement
ఈ వార్త దేశమంతా వ్యాపించింది, కానీ మూడు కళ్ల పిల్లని చేసుకోడానికి ఎవరూ రాలేదు ….చివరకు ఈ వార్త ఓ గుడ్డివాని చెవిలో పడుతుంది, అతను కుంటి వాడైన తన తమ్ముడిని తీసుకొని రాజు దగ్గరికి వెళ్లి, మీ కూతుర్ని నేను చేసుకుంటానని చెప్పి…రాకుమార్తెను వివాహం చేసుకుంటాడు.ఇచ్చిన మాట ప్రకారం…లక్ష బంగారు నాణాలు కట్నంగా ఇచ్చి, తన కుమార్తెను, గుడ్డివాడిని, కుంటివాడిని…ఓ ఓడ ఎక్కించి తన రాజ్యం నుంచి పంపించేస్తాడు రాజు.
కొన్నేళ్ళు భర్తతో సంసారం చేసిన …రాకుమార్తె మనసు మరిది అయిన కుంటివాని మీదకు మల్లుతుంది.అతనిని వశపరుచుకొని అతనితో సరసాలు సాగిస్తుంటుంది…ఇదే సమయంలో….భర్త అడ్డంకిని తొలగించుకొని మనం ఒకటవుదామని మరిదితో చెప్పి ఓ పథకాన్ని రచిస్తుంది. ఓ రోజు మరిది పామును చంపి తెచ్చి, చేపల కూర అని వండి,అన్న కు వడ్డించు, ఇది తిన్న అన్న చనిపోతాడు మనం ఇద్దరం ఒకటవ్వొచ్చని అంటాడు.
ఇక గుడ్డివాడైన భర్తతో…ఏవండీ…ఈ రోజు మీకిష్టమని చేపల కూర వండుతున్నాను. కాస్త పోయి దగ్గర కూర్చొని వాటిని కలుపుతుండండీ..ఈలోగ నేను ఇంటి పనులు ముగించుకొని వస్తానని చెబుతుంది. సరేనని పోయ్యి మీది గిన్నెలోని ముక్కలను కలుపుతుంటాడు గుడ్డివాడు. ఉడకుతున్న సర్పం యొక్క విషపు ఆవిర్లు…. ఆ గుడ్డి వాడి కళ్లకు తగలడంతో…అతనికి కండ్లొస్తాయ్…. పొయ్యి మీదున్న పాము ముక్కలను చూసి అతడికి ….భార్య, తమ్ముడు కలిపి తనను చంపాలనుకుంటున్నారనే అనుమానం వస్తుంది. అయినప్పటికీ…గుడ్డివాడిలాగే నటిస్తుంటాడు. ఈ లోగ తమ్ముడు వచ్చి, తన భార్య మీద చేతులు వేసి సరసాలాడుతుంటాడు. విషయం తెలుసుకున్న అతడు….మరుసాటి రోజు వాళ్లిద్దర్నీ అక్కడే వదిలి రాజు దగ్గరికి వెళ్లి, అక్కడి రాజుతో అసలు విషయం చెబుతాడు…తన ప్రాణగండాన్ని దూరం చేసిన ఈ వ్యక్తికి అందమైన తన రెండో కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు ఆ రాజు.
నీతి: నీ ప్రయత్నంలో నిజాయితీ ఉంటే.., చెడు చేసిన కూడా మంచే జరుగుతుంది అనడానికి ఈ కధ నిదర్శనం
Source:: FACEBOOK
End of Article