తెలివి ఉన్నా.., పైసల్ లేవు..! ఎకరం పొలం ఉన్నా బతికేటోళ్ళం అంటూ.. ఒకే కుటుంబం లో నలుగురి ఆత్మహత్య.. ఏమి జరిగిందంటే..?

తెలివి ఉన్నా.., పైసల్ లేవు..! ఎకరం పొలం ఉన్నా బతికేటోళ్ళం అంటూ.. ఒకే కుటుంబం లో నలుగురి ఆత్మహత్య.. ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

రైతు కుటుంబాలలో కష్టాలకు కొదవలేదని.. ఇంకా రైతుల ఆత్మహత్యలు ఆగలేదని చెప్పే ఘటన మరొకటి చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా మల్కెపల్లిలో భార్య, ఇద్దరు పిల్లలతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికం గా కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఓ సూసైడ్ నోట్ ను కూడా రాసి పెట్టారు.

Video Advertisement

manchiryala 1

“నాకు తెలివి ఉంది.. కానీ పైసలు లేవు.. అందరికీ ఈ నెలలో 25 వ తేదీ కి వాయిదా పెట్టేసాను.. కానీ, వాళ్ళు వచ్చి అడిగితె ఏమని చెప్పాలి..? మధ్యతరగతి కుటుంబాలకు ఇజ్జత్ ఎక్కువ. ఇజ్జత్ పోగొట్టుకుంటే బతకడం కష్టం.. ఒక్క ఎకరం పొలం ఉన్నా బతికేటోళ్ళమే. ఉన్న ఆస్తి అమ్మితే పది లక్షలు వస్తుంది. అంతకు పైన ఏడు లక్షల అప్పు ఉంది. ఈ అప్పు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నాం.. ఈ ఏడు ముప్పై ఎకరాల్లో పత్తి వేశా.. మొత్తం వంద క్వింటాళ్లు పండింది. ఖర్చులు ఇరవై వేల దాకా అయ్యాయి.. చేతికి మూడు లక్షలు వచ్చింది. ఒకరికి ఆ మూడు లక్షలు ఇచ్చేసా..

manchiryala 3

నేను పెట్టిన పెట్టుబడి మాత్రం రాలేదు. గతేడాది.. ఈ ఏడాది కూడా నష్టాలే.. అందులోను అప్పు చేసి బిడ్డ పెళ్లి చేశా.. ఏమి చేయాలి చెప్పండి ఇక.. మా చావు కి ఎవరు కారణం కాదు. కౌలు రైతుల పరిస్థితులు ఇలానే ఉంటాయి.. నేను లేకుండా ఉండలేమని భార్యా, పిల్లలు కూడా చెప్పిండ్రు. నేను లేకపోతె.. అప్పుల వాళ్ళు వాళ్ళని అడుగుతరు.. వారెక్కడనుంచి తెస్తారు..? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.. నన్ను తిట్టుకోవద్దు అన్నా, వదిన, మహేందర్, సందీప్.. ” అని ఆ కౌలు రైతు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

manchiryala 2

కౌలు రైతు జంజిరాల రమేశ్‌ (45) మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లో మల్కెపల్లి కి చెందిన వారు. గతేడాదిఇటీవలే కుమార్తె కు పెళ్లి చేశారు. కూతురు సౌమ్య (19), కుమారుడు అక్షయ్‌ (16) ఇద్దరు చిన్న పిల్లలే. పెళ్లి కోసం అప్పు చేయడం తో ఒత్తిడి ఎక్కువైంది. గురువారం అప్పు తీరుస్తానని అందరికి వాయిదా పెట్టారు. అయితే, అప్పు తీర్చలేక రమేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం ఇంట్లోంచి ఎవరు బయటకు రాకపోవడం తో.. రమేష్ అన్న వెళ్లి చూసారు. తల్లి, కూతుళ్లు ఒక గదిలో, మరో గదిలో తండ్రి, కొడుకులు ఆత్మ హత్య చేసుకోవడం తో హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వీరి కుటుంబం మరణం తో, గ్రామం లో విషాదం నెలకొంది.


End of Article

You may also like