“నిన్ను కొడతా..” అంటూ విశ్వక్ సేన్ కు మంచు లక్ష్మి సీరియస్ వార్నింగ్.. అసలేమైంది..?

“నిన్ను కొడతా..” అంటూ విశ్వక్ సేన్ కు మంచు లక్ష్మి సీరియస్ వార్నింగ్.. అసలేమైంది..?

by Anudeep

Ads

మంచు లక్ష్మి గురించి ప్రత్యేకం గా పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. పలు షో లలో హోస్ట్ గా వ్యవహరించి.. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె స్లాంగ్ ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. మోహన్ బాబు డాటర్ గానే కాదు.. లక్ష్మక్క గా కూడా ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా.. ఆమె మరో షో కి హోస్ట్ చేయబోతున్నారు.

Video Advertisement

viswak sen 2

“ఆహ భోజనంబు” అనే కొత్త షో ఇటీవలే స్టార్ట్ అయింది. “ఆహ” ఓటిటి ప్లాట్ ఫామ్ పైనే ఇది ప్రసారం కాబోతోంది. ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా రిలీజ్ కాకుండానే ఈ షో కి పాపులారిటీ వచ్చేస్తోంది. ఇటీవలే.. ఈ షో నుంచి ఒక ప్రోమో వీడియో రిలీజ్ అయింది.ఈ షో కి మొదటి గెస్ట్ గా హిట్ మూవీ హీరో “విశ్వక్ సేన్” వచ్చాడు. ఈ సందర్భం గా వీరు ఫుల్ ఫన్ జెనరేట్ చేసారని ఈ షో ప్రోమో చూస్తేనే తెలుస్తోంది.

viswak sen

ఈ షో కి మొదటి గెస్ట్ గా వచ్చిన విశ్వక్ సేన్ వంటలు చేసి మంచు లక్ష్మిని మెప్పించారు. ఆ తరువాత ఇద్దరు హ్యాపీ గా తినేసి కబుర్లు చెప్పుకున్నారు. ఆ టైం లోనే మంచు లక్ష్మి విశ్వక్ సేన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసారు. నీతో ఇదే ఫస్ట్ షో అంటూ మంచు లక్ష్మి అనగా..వెంటనే విశ్వక్ సేన్ “నేను మాత్రం మీ షో లు చిన్నప్పటి నుంచి చూస్తున్నా” అనేసి వెంటనే స్టన్ అయ్యాడు. మంచు లక్ష్మి సీరియస్ అయిపోయి..”కొడతా నిన్ను..” అంటూ లేవబోయింది. తరువాత అది షో కాబట్టి సైలెంట్ అయిపోయారు. ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తోంది.


End of Article

You may also like