Home Filmy Adda “మోసం చేస్తే ఇలాగే ఉంటుంది..!” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” టీజర్‌పై మంచు విష్ణు కామెంట్స్..!

“మోసం చేస్తే ఇలాగే ఉంటుంది..!” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” టీజర్‌పై మంచు విష్ణు కామెంట్స్..!

by Anudeep

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ఏదో చేయబోయే ఇంకేదో చేసినట్లు ఉన్నాడు. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఇప్పటికీ ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ టీజర్ ని జీర్ణించుకోలేకున్నారు. వింత ఆకారాలు, యానిమేషన్ గ్రాఫిక్స్ తప్ప అందులో రామాయణం కనిపించడం లేదు. ఇప్పటికే పలువురు ఆదిపురుష్ టీజర్ ని, దర్శకుడు ఓం రౌత్ ని తీవ్రంగా విమర్శించారు. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు త్వరలో చిత్ర యూనిట్ మరో టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

manchu vishnu comments on prabhas aadipurush..
అయితే మంచు విష్ణు తన తాజా చిత్రం ‘జిన్నా’ ప్రమోషన్స్ సందర్భంగా ఆదిపురుష్ పై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ తనను ఎంతో నిరాశ పర్చిందని తెలుపుతూ ఓపెన్ అయ్యారు మంచు విష్ణు. లైవ్ యాక్షన్ సినిమాగా రామాయణాన్ని చూపిస్తారని అనుకున్నాం కానీ ఇలా యానిమేటెడ్ సినిమాలా చేస్తారని ఊహించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

manchu vishnu comments on prabhas aadipurush..
ఒకవేళ టీజర్ విడుదలకు ముందే ఇదొక యానిమేషన్ సినిమా అని చెప్పి ఉంటే.. ఈ రకమైన ట్రోల్స్ నడిచేవి కావని మంచు విష్ణు అన్నారు. ప్రేక్షకులను మోసం చేస్తే ఇలాంటి రియాక్షన్ రావడంలో వింతలేదని ఆయన చెప్పారు. ఆదిపురుష్ టీజర్ చూస్తున్నప్పుడు తనకు రజనీకాంత్, దీపికా పదుకొనె నటించిన కొచ్చాడియాన్ చిత్రం గుర్తుకొచ్చిందని చెబుతూ ట్రోలర్స్‌కి బూస్టింగ్ ఇచ్చారు మంచు విష్ణు.

manchu vishnu comments on prabhas aadipurush..

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్‌తో, తానాజీ తర్వాత ఓం రౌత్ సినిమా అంటే జనాల్లో ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. కానీ ఆదిపురుష్ టీజర్ మాత్రం తనతో పాటు అందరినీ నిరాశ పర్చిందని మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

manchu vishnu comments on prabhas aadipurush..
ఆదిపురుష్ టీజర్ లో చూపించిన కొన్ని సన్నివేశాలపై వ్యతిరేకత చోటు చేసుకుంది. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలను కించపరిచేలా ఆదిపురుష్ సినిమా రూపొందించారంటూ కొందరు ప్రముఖులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

manchu vishnu comments on prabhas aadipurush..

ఏకంగా అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ లేవనెత్తారు. శ్రీరాముడు, హనుమంతుడు, రావణుడిని తప్పుగా చిత్రీకరించారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ప్రముఖ సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అదే కోణంలో ఓపెన్ అయ్యారు.

You may also like