ప్రజల క్షేమం కోసమని ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తే , కొందరు లెక్కలేకుండా ప్రవర్తిస్తు లేనిపోని తంటాలు తెచ్చుకుంటున్నారు. లాక్ డౌన్ లో భాగంగా నిత్యావసర సరుకులు, మెడికల్ రంగాలను అందుబాటులో ఉంచి, మిగతా ఏ పనులకి బయటకి రాకూడదని చెప్తే, కొందరు మందుబాటిల్ చేతబట్టి అందరికి తలా ఇంత పోస్తూ పెద్ద దానకర్ణుల్లా బిల్డప్ ఇస్తున్నారు.. ఇప్పుడు అలాంటి వారి పని పడుతున్నారు పోలీసులు.

Video Advertisement

ఒక వ్యక్తి మందు బాటిల్ చేతపట్టి రోడ్ పై ఉన్న వ్యక్తులకి బహిరంగంగా మందు పోస్తూ ఒక వీడియో తీయించుకున్నాడు.. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరలైంది. అతడి పేరు కుమార్, ఉండేది పాతబస్తీగా గుర్తించారు పోలీసులు.

లాక్ డౌన్  నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కుమార్ ని చంపాపేట లోని తన నివాసం లో అదుపులోకి తీసుకొన్నారు సరూర్ నగర్ ఎక్సైజ్ అధికారులు .అంతేకాదు అతడిపై సెక్షన్ 34(a) ఆఫ్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు.ఎవరైనా సరే సరదాపేరుతో ,టైం పాస్ కి నిబంధనలు దిక్కరిస్తే కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందని , కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాసరావు ట్విటర్లో శేర్ చేశారు.

అసలు కలలో కూడా జరగదు అనుకున్న సంపూర్ణమద్యపాన నిషేదం కరోనా పుణ్యమాని అమలులోకి వచ్చింది. దాంతో తాగుబోతులు  ఇబ్బంది పడినప్పటికి, వారి కుటుంబ సభ్యులు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మద్యం వల్ల జరిగే అనర్ధాలు అన్ని ఇన్ని కావు. కానీ మన టిక్ టాక్ ప్రియులు ఊరికే ఉండరు కదా. ఈ విషయాన్ని కూడా టిక్ టాక్ వీడియోకి ఉపయోగించుకుని టిక్ టాక్ లు చేసేశారు. మన పోలీసులు ఏమైనా మామూలోల్లా.. అసలే కరోనా వ్యాప్తి చెందకుండా ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. దెబ్బకి దెయ్యం దించుతున్నారు అందరికి..ఇప్పుడు చెప్పండి పోలీసులు ఇచ్చిన కిక్ ఎలా ఉంది??