కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే . లాక్ డౌన్ నిబందనలు పాటించని వారిపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ప్రజల్ని బతిమిలాడుతుంటే, మరికొన్ని చోట్ల తమ లాఠీలకు పనిచెప్తున్నారు. తాజాగా లాక్ డౌన్ వేళ ఆంధ్రాలో ఒక అపశృతి దొర్లింది. పోలీసుల తీరుకు ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Video Advertisement

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గౌస్ పాషా ఇటీవల రోడ్డుపైకి వచ్చాడు. పోలీసుల రోడ్డు మీదకి ఎందుకొచ్చావంటూ కొట్టారు. నిజానికి పాషా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. రోజు మందులు వేసుకోవాలి. మందులు అయిపోవడంతో మెడికల్ షాప్ కి వెళ్లడానికి బయటికి వచ్చాడు.అతడిని ఆపారు..బయటకి ఎందుకు వచ్చావు అని అడిగారు. దాంతో పాషా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోలీసులు వెంటనే పాషాను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలోనే పాషా మృతిచెందాడు.

పాషా మృతితో సత్తెనపల్లిలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది.  పోలీసులు కొట్టడం వల్లే  పాషా చనిపోయాడని అతని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పాషా మృతదేహంతో అతని బంధువులు భారీగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పాషా బందువులను ఆపే క్రమంలో జరిగిన చిన్నపాటి ఘర్షణలో బంధువులు సిఐని కొట్టారు.

representative image only

విషయం తెలిసిన గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనకు కారణమైన సత్తెనపల్లి ఎస్సై రమేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.ఇదిలా ఉండగా “ తాము పాషాను కొట్టలేదని అంటున్నారు. నిబంధనలు పాటించకుండా రోడ్డు మీదకు ఎందుకొచ్చావని అడగగానే,భయపడి కిందపడిపోయాడని,  హాస్పిటల్ కి తీస్కెళ్తుండగా చనిపోయాడని” పోలీసులు అంటున్నారు.. నిజం ఏంటనేది తేలాల్సి ఉంది.