Ads
చట్టం మీ చుట్టమా..? అని అడుగుతాం కానీ పోలీసులు మీ చుట్టాలా అని అడగం. ఎందుకంటే.. పోలీసులు అందరికి బంధువులు లాంటివారు. ఎందుకంటే.. ఎవరికీ ఏ కష్టం వచ్చినా.. ముందు పోలిసుల వద్దకు వెళ్తాము.. న్యాయం చేయమని కోరతాం. అయితే, మనకి న్యాయం జరిగాక ఆ పని అక్కడితో అయిపోతుంది. కానీ, ఓ మహిళకు పోలీసులు నలభయేళ్ళుగా సాయం అందిస్తున్నారు.
Video Advertisement
ఆమె ఇల్లు పోలీస్ స్టేషన్ లోనే. నలభయి ఏళ్ళు గా ఆమె అక్కడే నివాసం ఉంటోంది. చివరకు ఆమె ఆధార్ కార్డు లో అడ్రస్ కూడా ఆ పోలీస్ స్టేషన్ పేరే ఉంటుంది. కర్ణాటకలోని మంగళూరు లోని బండారు పోలీస్ స్టేషన్ కథ ఇది. నలభయేళ్ల క్రితం హొన్నమ్మ అనే మహిళా కర్ణాటకలోని మంగళూరుకి చెందిన బండారు పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. అప్పటికి ఆమె వయసు ఇరవైఏళ్లు. ఆమె పుట్టుకతోనే చెవుడు. మూగ. దీనితో.. ఆమె ఎవరో, ఎక్కడ నుంచి తప్పి పోయి వచ్చిందో.. ఏమి చెప్పలేకపోయింది.
రైల్వే స్టేషన్ లో ఆమె కనిపించడం తో, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఆశ్రయమిచ్చారు. ఆమె ఏమి చెప్పలేకపోవడం తో.. పోలీసులు ఆమెను అక్కడే ఉంచేసి, ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. ఆమెకు చికిత్స చేయించారు. తిరిగి మాట్లాడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆమె అసలు పేరు కూడా తెలియకపోవడం తో పోలీసులు ఆమెకు హొన్నమ్మ అని నామకరణం చేసారు. ఆమె అసలు పేరు తేలికపోవడం తో బంధువులు ఎవరో కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారు.
image credits: daijiworld.com
పుట్టుకతోనే చెవుడు, మూగ అయినప్పటికి, హొన్నమ్మ చాలా ఆక్టివ్ గా ఉంటారట. ఉదయాన్నే పోలీస్ స్టేషన్ మొత్తాన్ని శుభ్రం చేస్తుందట. రాత్రి సమయం లో పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఓ గదిలో పడుకుంటారట. పోలీసులే ఆమెకు ఆహరం కూడా అందిస్తూ వస్తున్నారట. రోజు పోలీస్ స్టేషన్ ను శుభ్రం చేసినందుకు.. పోలీసులు ఆమెకు జీతం చెల్లిస్తారట. ఆ సొమ్ముని ఆమె బ్యాంకులో భద్రం చేసుకుంటుందట. చాల పనులు హొన్నమ్మ ఒంటరి గానే చేసుకుంటుందట. బ్యాంకుకు వెళ్లడం, నగదు జమ చేసుకోవడం, ఓటు వేయడం వంటి పనులు కూడా సొంతం గా చేసుకోగలదట.
image credits: daijiworld.com
బ్యాంకు పాస్ బుక్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు తో సహా ఆమె గుర్తింపు కార్డులన్నీ పోలీస్ స్టేషన్ అడ్రస్ తోనే ఉన్నాయి. సైగ భాషలోనే ఆమె కమ్యూనికేట్ చేస్తుంటుంది. పోలీసులు తనకు ఆశ్రయమిచ్చి ఆదుకున్నారని సైగలు చేసి చెప్తూ మురిసిపోతుంది. ప్రస్తుతం ఆమె వయసు అరవై కి చేరువలో ఉంది. ఈ క్రమం లో ఆమెకు పెన్షన్ వచ్చే ఏర్పాటు ను కూడా పోలీసులు చేయబోతున్నారు. ఎంతైనా ఈ పోలీసులు గ్రేట్ కదా..
End of Article