Ads
కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం.. భారీ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ఇదే. మణిరత్నం 40 యేళ్ల డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో దీనిపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Video Advertisement
ఈ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చోళుల స్వర్ణయుగాన్నిఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ఓ నవల ఆధారంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ నవల తమిళనాడు లో చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని సినిమా చేయాలనీ ఎంజేఆర్ నుంచి కమల్ హాసన్ వరకు చాలా మంది ప్రయతించారు. మొత్తంగా ఇప్పుడు మణిరత్నం పుణ్యమా అని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమాలో కరికాలన్‌గా విక్రమ్.. అరుణ్ మోళి వర్మన్‌గా జయం రవి.. వల్లవరాయన్ వాందివదేవన్‌గా కార్తి.. నందినిగా ఐశ్వర్యారాయ్.. కుందవై పిరిత్తియార్‌గా త్రిష నటిస్తున్నారు. ఇదిలా ఉంటే త్రిష, ఐశ్వర్య రాయ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సెట్ లో ఈ ఇద్దరు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పొన్నియన్ సెల్వన్ చిత్రంలో విలనిజయం షేడ్స్ ఉన్న నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్ కనిపించనుంది. పెరియా పళవెట్టియార్‌కు భార్య పాత్రలో నటించింది. ఈమె తన గ్లామర్‌తో పాటు అభినయంతో ఎలాంటి పురుషుడినైనా తనకు దాసోహం అనేలా చేసుకునే పాత్రలో నటించింది. గతంలో తనను అవమానించి వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనే కాలనాగు తరహా పాత్రలో ఐశ్వర్య రాయ్ కనిపించనుంది. మరోవైపు త్రిష రాకుమారి కుందవై పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో రాణులుగా నటించిన ఐశ్వర్య, త్రిష నగలను ఇప్పుడు వేలం వేయనున్నారట చిత్రయూనిట్. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో వీరు ధరించిన నగలు చాలా వరకు అసలైన బంగారు నగలే అని వారు వెల్లడించారు.
ఈ చిత్రంలో ఐష్ ధరించిన నగలు హైదరాబాద్ కు చెందిన కిషన్‌దాస్ & కో రూపొందించారు. వీటి కోసం 18 మంది కళాకారులు ఆరు నెలల పాటు కష్టపడ్డారు. వీటి కోసం ఎంతో పరిశోధన చేశామని వారు వెల్లడించారు. వీటిలో సాంప్రదాయ కుందన్ సెట్టింగ్‌లో తయారు చేయబడిన నెక్లెస్‌లు మరియు పచ్చలు, కెంపులు, పసుపు నీలమణిలు, రాఖోడి విలువైన రత్నాలతో సహా మాంగ్ టికా, వంకీ, రింగ్‌లు మరియు ఝుంకాలు చేతితో తయారు చేసారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాల, పార్తీబన్, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు
End of Article