Ads
ఇటీవల జరిగిన మణిపూర్ ఘటన చాలా కలకలం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఆ నేరస్తులకి శిక్ష పడాలి అని ప్రజలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక బాధితురాలి భర్త మాట్లాడుతూ ఈ సంఘటనపై తన ఆవేదనని వ్యక్తం చేశారు.
Video Advertisement
హిందుస్థాన్ టైమ్స్ తెలుగు కథనం ప్రకారం, ఆయన ఒక కార్గిల్ యుద్ధ వీరుడు. ఒక సమయంలో కార్గిల్ యుద్ధంలో భారతదేశం తరపున పోరాడారు. భారత సైన్యంలోని అసోం రెజిమెంట్లో ఆయన సుబేదార్గా చేశారు.
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. “మే 4వ తేదీన ఉదయం కొంతమంది వచ్చి మా గ్రామంపై దాడి చేశారు. అప్పుడు ఇళ్లని తగలబెట్టారు. అందరి ముందు ఇద్దరు మహిళలని తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు ఉన్నా కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ నిందితులని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నాను”.
“నేను దేశం కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాను. శ్రీలంకలో ఉన్న ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో కూడా బాధ్యతలు నిర్వర్తించాను. దేశాన్ని కాపాడగలిగాను కానీ రిటైర్మెంట్ తర్వాత నా భార్యని, నా గ్రామస్తులని కాపాడుకోలేకపోయాను. దీనికి చాలా బాధగా ఉంది” అంటూ కంటతడి పెట్టుకున్నారు.
ఇదే ఘటనలో మరొక బాధితురాలి తల్లి కూడా ఈ విషయంపై తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “నా భర్తని నా కొడుకుని చంపేసి ఆ తర్వాత నా బిడ్డను తీసుకెళ్లారు. నా ఆశలన్నీ నా కొడుకు మీదే ఉండేవి. చాలా కష్టపడి నా కొడుకుని స్కూల్ కి పంపించాము. నా పెద్ద కొడుకుకి ఉద్యోగం లేదు. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. ఇంక మేము తిరిగి ఆ గ్రామానికి వెళ్ళము. వెళ్ళలేము కూడా”.
“మా ఇళ్ళని తగలబెట్టారు. మా పొలాలని కూడా నాశనం చేశారు. ఇంక అక్కడికి వెళ్లి నేను ఏం చేయాలి? మొత్తం గ్రామాన్నే తగలబెట్టేశారు. నా కుటుంబం భవిష్యత్తు నాకు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నాకు చాలా కోపంగా ఉంది. దేశంలోని తల్లిదండ్రులు అందరూ చూడండి. ఇది మా పరిస్థితి” అని ఆమె మాట్లాడారు. ఈ ఘటనలో ఉన్న నిందితులని శిక్షించాలి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : “ధోని” అన్న ఇంత దీనస్థితిలో ఉన్నారా..? బయోపిక్ లో ఆయన గురించి ఎందుకు ప్రస్తావించలేదు..?
End of Article