“ధోని” అన్న ఇంత దీనస్థితిలో ఉన్నారా..? బయోపిక్ లో ఆయన గురించి ఎందుకు ప్రస్తావించలేదు..?

“ధోని” అన్న ఇంత దీనస్థితిలో ఉన్నారా..? బయోపిక్ లో ఆయన గురించి ఎందుకు ప్రస్తావించలేదు..?

by kavitha

Ads

మిస్టర్ కూల్, భారత జట్టు మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని కున్న క్రేజ్ గురించి తెలిసిందే. టీమిండియాకు 3 ఐసీసీ టైటిళ్లు సాధించిన లెజెండరీ కెప్టెన్‌, ఐపీఎల్ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను 5 సార్లు విజేతగా నిలిపిన ధోనీ ఇండియన్ క్రికెట్ చరిత్రలో సాటిలేని కెప్టెన్ గా నిలిచాడు.

Video Advertisement

ధోనీ కెరీర్ గురించి అందరికీ తెలిసినా, భార్య, కుమార్తె గురించి తప్ప మిగిలిన ఫ్యామిలీ గురించి అంతగా తెలియదు. అయితే ధోనీకి ఒక అన్న ఉన్నాడని, అతను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, ధోని అతన్ని పట్టించుకోవడం లేదని నెట్టింట్లో తాజాగా ఒక ఫోటో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
dhoni-brother-narendra-singh-dhoniధోనీ తన ఆటతో ఏ క్రికెటర్ కి సాధ్యం కాని విధంగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయినప్పటికీ, ధోనీ ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ధోనీకి సంబంధించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తాజాగా ధోనీకి స్వంత అన్న ఉన్నాడని, అతడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, ధోని తన అన్నను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అతని గురించి ధోని బయోపిక్‌ గా వచ్చిన ‘ఎంఎస్‌ ధోని:ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ లో కూడా చూపించలేదని అంటున్నారు.
ధోనికి ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరు నరేంద్ర సింగ్‌ ధోని. ధోనీ కన్నా పదేళ్ళు పెద్దవాడు. కొంతకాలం క్రితం ధోని రాంచిలో ఉన్న తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో కలసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఏడాది  ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన అనంతరం ధోనిని నరేంద్ర కలిశాడని ది క్రిక్‌టైమ్‌ తెలిపింది. నెటిజెన్లు చేస్తున్న కామెంట్స్ కు నరేంద్ర సింగ్‌ ధోని గతంలో ఒక ఇంటర్వ్యూతో ధోనీ ఫ్యాన్స్ జవాబు ఇస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూలో నరేంద్ర సింగ్‌ ధోని మాట్లాడుతూ, ‘మహీ చిన్నతనం, యువకుడిగా కష్టాలు పడ్డ టైమ్ లో నేను ధోనీకి సాయం చేయలేదు. అతను క్రికెటర్ గా ఎదగడంలో నా ప్రమేయం ఏం లేదు. మహీ నాకన్నా పది సంవత్సరాలు చిన్నవాడు. తను తొలిసారి బ్యాట్‌ పట్టుకునే టైమ్ కి రాంచి విడిచి ఉన్నత చదువుల కోసం కుమాన్‌ యూనివర్సిటీకి వెళ్ళాను. కానీ మహీకి కొన్నింటిలో నైతికంగా అండగా ఉన్నా, వాటన్నిటినీ మూవీలో ఇరికించాల్సిన పని లేదు. నిజానికి ఈ మూవీ మహీ గురించి, అతడి ఫ్యామిలీ గురించి కాదు’’ అని చెప్పుకొచ్చారు.
నరేంద్ర సింగ్‌ ధోనికి పాలిటిక్స్ అంటే ఆసక్తి అని తెలుస్తోంది. అతను 2013 నుండి సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగుతున్నాడు. దానికి ముందుగా బిజెపిలో ఉండేవారని సమాచారం. నరేంద్ర 2007లో వివాహం చేసుకోగా, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్లు నేషనల్ మీడియా కథనాలు తెలుపుతున్నాయి.

Also Read: “ధోని” కావాలనే రన్ అవుట్ అయ్యాడు..! యువరాజ్ సింగ్ తండ్రి కామెంట్స్..!


End of Article

You may also like