“ధోని” కావాలనే రన్ అవుట్ అయ్యాడు..! యువరాజ్ సింగ్ తండ్రి కామెంట్స్..!

“ధోని” కావాలనే రన్ అవుట్ అయ్యాడు..! యువరాజ్ సింగ్ తండ్రి కామెంట్స్..!

by kavitha

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పై ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి మరియు మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తీవ్ర విమర్శలు చేశాడు. ధోని ఒక స్వార్థపరుడు, 2019లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత జట్టు పరాజయనికి అతనే కారణమని ఆరోపించారు.

Video Advertisement

అది మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ సారధ్యంలో భారత జట్టు ప్రపంచ కప్ గెలవకూడదని ధోనీ ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర చేశాడని వెల్లడించారు. ఈ విషయం పై ట్విట్టర్ వేదికగా యోగ్‌రాజ్ సింగ్ ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
yograj-singh-makes-statement-on-ms-dhoniకోహ్లీ కెప్టెన్సీ‌లో ధోనీ కుట్ర చేశాడని యోగ్‌రాజ్ సింగ్ ఆరోపించారు. తాను తప్ప భారతజట్టు తరఫున ఇంకొకరు వరల్డ్ కప్ గెలవకూడదనే దురాలోచనతో ధోనీ కావాలనే రన్ అవుట్ అయ్యాడని అన్నారు. ఈ మేరకు యోగ్‌రాజ్ సింగ్ తన ట్విటర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఆ ఇన్సిడెంట్ ను తలుచుకుంటే ఇప్పటికీ నా రక్తం మరుగుతోంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఉద్దేశ్యపూర్వకంగా బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. టీమిండియా తరఫున ఇంకో కెప్టెన్ వరల్డ్ కప్ గెలవడం అనేది ధోనీ ఇష్ట పడలేదు. అందువల్ల ఒకవైపు రవీంద్ర జడేజా గెలవాలనే తపనతో బాగా ఆడుతున్నా, ధోనీ జడేజాకు  సహకరించలేదు. జిడ్డు బ్యాటింగ్‌తో అతని పై ఒత్తిడి పెంచి అతను ఔటయ్యేలా చేశాడు.తన ప్రతిభకు తగిన విధంగా బ్యాటింగ్ చేయకుండా చివర్లో కావాలనే రన్ అవుట్ అయ్యాడు. ధోనీలో మ్యాచ్ గెలవాలన్న కసి ఏమాత్రం ఉన్నా, తన సామర్థ్యంలో 40 శాతం వినియోగించినా కూడా టీమిండియా 48వ ఓవర్‌లోనే గెలిచి ఉండేది’ అని యోగ్‌రాజ్ సింగ్ వెల్లడించారు. ఈ వీడియోను విరాట్ కోహ్లీ కోసం ప్రతి అభిమాని చూడాలని యోగ్‌రాజ్ సింగ్ అభ్యర్థించారు.

Also Read: “రికీ పాంటింగ్” పేరిట ఉన్న ఆ 4 రికార్డులు ఎప్పటికీ బ్రేక్ అయ్యేనో.?

 


You may also like

Leave a Comment