మణిరత్నం సినిమాలు సముద్రం పైనుంచి వీచే చల్లని గాలిలాంటివి. మనసుకు హృద్యం గా హత్తుకుంటూ ఉంటాయి. అందుకే ఆయన సినిమా వస్తుందంటే చాలు సినిమా అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. తాజాగా.. ఆయన క్రియేషన్ లో ఆంథోలజి సినిమా తొమ్మిది ఎపిసోడ్ లు గా రాబోతున్న సంగతి తెలిసిందే. దీని గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి క్యూరియాసిటీ మొదలైంది. ఈ చిత్రం లో తొమ్మిది రసాలను చూపించే ప్రయత్నం చేసారు.

Video Advertisement

navarasa

ఐతే.. ఇందుకోసం పదిమంది దర్శకులు పని చేసారు. ఇప్పటి దాకా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అన్ని పోస్టర్లు, పాటలు విశేషం గా ఆకట్టుకున్నాయి. వచ్చేనెల 6 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ రోజు కోసం అందరు ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా ఈ చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. రేపు ఉదయం 9.09 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల అవుతుంది.